ప్రియా కన్నుగీటుకు అమూల్ బేబీ ఫ్లాట్

Sun Feb 18 2018 10:54:19 GMT+0530 (IST)

కొన్ని బ్రాండ్లు మనసులో అలా రిజిస్టర్ అయిపోతాయ్. జనజీవితంలో భాగమైపోతాయి. అలాంటి కోవలోకే  వస్తుంది అమూల్ బటర్ బ్రాండ్. ప్యాక్ మీద మొదలు యాడ్ వరకూ అమూల్ బటర్ ను ఒక బుజ్జిదాని కార్టూన్ అందరిని ఆకట్టుకుంటుంది. ఏళ్లు గడిచినా ఈ కార్టూన్ బుజ్జిదాని ఇమేజ్ కించిత్ కూడా తగ్గలేదు.ఏదైనా సన్సేషనల్ అయితే.. ఈ బుజ్జిది అందుకు తగ్గట్లుగా తనను మార్చుకోవటం జరుగుతుంది. పీకే మూవీ టైంలో అమీర్ ఖాన్ మాదిరి.. సచిన్.. ధోనీ ఇలా చాలామందిని ఇమిటేట్ చేసిన ఈ బుజ్జిది ఈసారి మరో చిత్రమైన వ్యక్తిని ఇమిటేట్ చేసింది.

ఒకే ఒక కనుసైగతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారి.. రాత్రికి రాత్రి ఓవర్ నైట్ స్టార్ గా అవతరించిన ప్రియా ప్రకాశ్ వారియర్ ను ఇమిటేట్ చేసింది. కన్నుగొట్టటం ఇప్పటికి కొన్ని కోట్ల మంది కొట్టి ఉంటారు. కానీ.. ఎవరికి దక్కనంత పాపులార్టీ ప్రియాకు దక్కింది. ఆమె కన్నుగీట యావత్ దేశాన్ని కదిలించివేసింది.

నిజానికి తాను చేసిన సీన్ అంత పాపులర్ అవుతుందని ప్రియ సైతం అనుకోలేదట. ప్రియా కన్నుగీటను ఫాలో అయిపోయింది అమూల్ బుజ్జిది. తాజాగా అమూల్ బటర్ ఉత్పత్తి కార్డ్ బోర్డు మీద కన్ను గొడుతున్నట్లుగా తయారు చేసేశారు. ప్రియాకు ఇప్పటివరకూ వచ్చిన పేరు ప్రఖ్యాతులు ఒక ఎత్తు అయితే.. ఒక ఫేమస్ బ్రాండ్‌కు చెందిన కార్టూన్ ప్రియా కన్నుగీటను అనుకరించటం ఆమెకు దక్కిన గొప్ప గుర్తింపుగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఇంకెన్ని రికార్డుల్ని ప్రియా తన పేరుతో రాసుకుంటుందో?