బన్నీ ఛాన్స్ అలా మిస్ చేసుకుందట!

Wed Jan 23 2019 07:00:01 GMT+0530 (IST)

గత ఏడాది కన్ను గీటి ముద్దుగన్ను పేల్చిన ప్రియా వారియర్ ఏ స్థాయిలో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మలయాళి ముద్దుగుమ్మ ఒరు ఆదార్ లవ్ చిత్రంలోని ఆ రెండు సీన్స్ తో ప్రియా వారియర్ జాతీయ స్థాయిలో సెలబ్రెటీ అయ్యింది. ఒక్కసారిగా స్టార్ స్టేటస్ రావడంతో దాదాపు అన్ని సినీ ఇండస్ట్రీల నుండి నాకు పిలుపు వచ్చిందని తమ సినిమాల్లో నటించమంటే తమ సినిమాల్లో నటించమంటూ ముందుకు వచ్చారు. తెలుగు సినిమా నుండి కూడా తనకు చాలా ఆఫర్లు వచ్చాయంటూ ప్రియా వారియర్ తాజాగా పేర్కొంది.ప్రియా వారియర్ ఒరు ఆదార్ లవ్ చిత్రం ప్రేమికుల రోజు సందర్బంగా విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా హైదరాబాద్ లో సందడి చేసిన ప్రియా వారియర్ మీడియాతో మాట్లాడుతూ తనకు వచ్చిన తెలుగు ఆఫర్స్ గురించి చెప్పుకొచ్చింది. తెలుగు నుండి ఎన్నో ఆఫర్లు వచ్చాయి అయితే వాటిలో ఎక్కువ శాతం చిన్న సినిమాలే ఉన్నాయి. తెలుగు నుండి వచ్చిన అతి పెద్ద ఆఫర్ అంటే అల్లు అర్జున్ నుండి వచ్చిందే. నా వీడియోలు వైరల్ అయిన కొన్ని రోజులకే అల్లు అర్జున్ గారి సినిమాలో చేయాలంటూ పిలుపు వచ్చింది. అయితే నేను 'ఒరు ఆదార్ లవ్' చిత్రం షూటింగ్ లో ఉండటం వల్ల అల్లు అర్జున్ గారి సినిమాను చేయలేక పోయానంది. మరోసారి ఆ ఛాన్స్ వస్తే మాత్రం తప్పకుండా చేస్తానంది.

ఒరు ఆదార్ లవ్ చిత్రం ఫలితం తర్వాత తదుపరి చిత్రం విషయంలో నిర్ణయం తీసుకుంటానంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు దర్శకులు కథలు చెప్పారని వాటి గురించి ఆలోచిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. హిందీ ఇండస్ట్రీకి కూడా వెళ్లే ఆలోచనలో ఈ అమ్మడు ఉన్నట్లుగా అనిపిస్తుంది.