Begin typing your search above and press return to search.

ప్రియ వారియర్.. ఆ వార్తల్లో నిజం లేదట

By:  Tupaki Desk   |   12 March 2018 7:00 AM GMT
ప్రియ వారియర్.. ఆ వార్తల్లో నిజం లేదట
X
కేవలం ఒకే ఒక్క చిన్న వీడియోతో భారతదేశం మొత్తంలో ఒక స్టార్ అయిపోయింది ఆమె. తనే ప్రియ ప్రకాష్ వరియర్, ఒకే ఒక్కసారి కన్ను గీటి కుర్రకారును ఉర్రూతలూగించింది. ప్రియ గురించి వచ్చిన ఎలాంటి వార్త అయినా వైరల్ అవ్వాల్సిందే. అందుకే కొందరు అబద్ధపు వార్తలు కూడా రాసేస్తున్నారు అంటున్నారు ఆమె మేనేజర్. పదండి ఈ కథేంటో చూద్దాం.

ఈమధ్యనే ప్రియ గురించి కొన్ని తప్పుడు వార్తలు బయటికి వచ్చాయి. ఇన్స్టాగ్రామ్ లో కొన్ని బ్రాండ్స్ ని ప్రమోట్ చేయడానికి ప్రియ ఏకంగా 8 లక్షలు తీసుకుంటోందని కొన్ని రూమర్లు ఇండస్ట్రీలో హల్ చల్ చేశాయి. కానీ అవన్నీ ఎవరో కల్పించినవి అని నిజం అది కాదు అని ఈ సెన్సేషన్ గర్ల్ మేనేజర్ చెప్పుకొచ్చారు. ఇలా బ్రాండ్స్ తరపు నుండి బోలెడు ఆఫర్లు ప్రియకు వస్తున్నాయి కానీ తను మాత్రం సినిమా విడుదల అయ్యేవరకు ఆగాలనుకుంటుంది అని చెప్పారు ఈ మలయాళం పిల్ల మేనేజర్.

అంతే కాదు. కేరళలో సోషల్ మీడియాను వేదిక చేసుకుని బ్రాండ్స్ ప్రమోట్ చేయడం లాంటివి అంత ఎక్కువగా జరగదని, ఆ ట్రెండ్ బాలీవుడ్లో ఉన్నంత ఎక్కువగా అక్కడ అంత వ్యాపించలేదు అని కూడా చెప్పుకొచ్చారు. అయితే ప్రియా ఇండియా అంతటా పాపులర్ అయినప్పుడు.. కేవలం కేరళలో బ్రాండ్స్ ను ప్రమోట్ చేసే అలవాటు లేదు అని చెప్పడం కామెడీగా ఉంది కదూ.