ప్రియా వారియర్ యాటిట్యూడ్ చూశారా?

Sun Apr 15 2018 16:59:17 GMT+0530 (IST)

కేవలం 30 సెకన్ల వీడియోతో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకుంది ప్రియా వారియర్. ఆమె కన్ను గీటే వీడియో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ వీడియో తర్వాత దేశవ్యాప్తంగా ఆమె పేరు మార్మోగింది. మలయాళం నుంచే కాక వేరే భాషల నుంచి కూడా ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. కానీ సినిమాల్ని ఆచితూచి ఎంచుకోవాలనుకుంటోంది ప్రియ. చేతిలో ఉన్న కమిట్మెంట్లు పూర్తి చేసి జూన్లో కొత్త సినిమాలు ప్రకటిస్తానని ఆమె అంటోంది. ఈలోపు ప్రియ క్రేజ్ ను ప్రకటనలకు ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. ప్రియ నటించిన తొలి యాడ్ బయటికి వచ్చేసింది కూడా.నెస్ట్లే మంచ్ యాడ్లో తళుక్కుమంది ప్రియ. ప్రస్తుతం జనాల్ని ఐపీఎల్ ఊపేస్తున్న నేపథ్యంలో ఆ బ్యాక్ డ్రాప్ లోనే ఈ యాడ్ రూపొందించారు. మైదానంలో క్రికెట్ ఆడుతున్న ఓ కుర్రాడు బంతి వదిలేస్తాడు. అది ప్రియ దగ్గరికి వెళ్తుంది. బంతి ఇవ్వమంటే ఆమె నో అంటుంది. ఇంత యాటిట్యూడా అంటాడా కుర్రాడు. అప్పుడామె మంచ్ తింటూ ఉంటుంది. దాంతో పాటుగా ఫ్రీగా వచ్చే యాటిట్యూడ్ హ్యాండ్ బ్యాండ్ వేసుకోవడం వల్ల ఆమె ఆ యాటిట్యూడ్ చూపిస్తుందన్నమాట. ఈ యాడ్లో చాలా గ్లామరస్ గా కనిపించి మురిపించింది ప్రియ. తనదైన శైలిలో ఒక చోట కన్ను కూడా గీటుతుందామె. ఈ యాడ్ ప్రియ అభిమానుల్ని అలరిస్తుందనడంలో సందేహం లేదు.

వీడియో చూడటానికి క్లిక్ చేయండి