వింక్ గాళ్ మిస్సింగ్ రీజన్?

Sun Dec 16 2018 20:00:01 GMT+0530 (IST)

ఒక్క కన్ను గీటుతో కుర్రకారు గెండె ఖిల్లా కొల్లగొట్టింది ప్రియా వారియర్. వింక్ గాళ్ గా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. ఒక్క కన్నగీటుతోనే సామాజిక మాధ్యమాల్లో సన్నీలియోన్‌ని మించిన ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఈ ఏడాది బెస్ట్ సెర్చ్ డ్  గాళ్ గానూ గూగుల్ జాబితాలో రికార్డులకెక్కింది. క్యూల్ లుక్స్ .. హాట్ అప్పీల్ ఈ అమ్మడికి పెద్ద ప్లస్. వింక్ గాళ్ గా తనకు వచ్చిన క్రేజున వాణిజ్య ప్రకటనల రూపంలో భారీగానే క్యాష్ చేసుకుంది ఈ బ్యూటీ.అయితే ఈ భామను ఇంత ఫేమస్ చేసిన ఒరు ఆధార్ లవ్ చిత్రం గురించి ఇటీవల ఎలాంటి అప్ డేట్ లేదు. తాజా సమాచారం ప్రకారం ఒరు ఆధార్ లవ్ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా రిలీజవుతోంది. ఒమర్ లుల్ తెరకెక్కించిన ఈ సినిమా కాన్వాసు మారి భారీ క్రేజుతో రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే ఆ సినిమా సంగతి అలా ఉండగానే ఈ మలయాళీ నటి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. ప్రియా నటిస్తున్న తొలి హిందీ సినిమాకు `శ్రీదేవి బంగ్లా` అనే టైటిల్ ను ఫైనల్ చేసి - ప్రస్తుతం లండన్ లో చిత్రీకరణ సాగిస్తున్నారట. ప్రశాంత్ మాంబుల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇదే మూవీలో కొరియోగ్రాఫర్ - నటుడు ప్రభుదేవా ఓ కథానాయకుడిగా నటిస్తున్నారు. దాదాపు రూ.70 కోట్లతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

అలాగే ప్రియా వారియర్ కు మెగా కాంపౌండ్ నుంచి పలువురు హీరోలు అవకాశాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అప్పట్లో ప్రచారమైనా దానికి సంబంధించిన అప్ డేట్ లేదు. ఇక బన్నిలాంటి స్టార్ హీరో వింక్ గాళ్ కి అప్పట్లో ఫిదా అయిపోయి పొగిడేశారు. భవిష్యత్ లో శిరీష్ - సాయిధరమ్ లాంటి స్టార్ల సరసన ఈ అమ్మడికి అవకాశం ఉందన్న ప్రచారం సాగింది. అలాగే దేవరకొండ నిఖిల్ లాంటి హీరోలకు ఈ అమ్మడు ఆప్షన్ గా మారుతుందన్న ప్రచారం ఉంది. ఇప్పటికైతే వింక్ గాళ్ సోషల్ మీడియా క్వీన్ గా నిరంతరం కొత్త ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. తాజాగా ప్రియా రివీల్ చేసిన ఓ ఫోటో యూత్ లో వేడెక్కిస్తోంది.