Begin typing your search above and press return to search.

ప్రియా వారియర్ మరో వీడియో వైరల్

By:  Tupaki Desk   |   20 July 2019 9:12 AM GMT
ప్రియా వారియర్ మరో వీడియో వైరల్
X
సోషల్‌ మీడియా సెన్షేషన్‌ ప్రియా వారియర్‌ జోరు 'ఒరు ఆదార్‌ లవ్‌' ఫ్లాప్‌ అవ్వడంతో కాస్త తగ్గింది. కన్ను గీటడం.. ముద్దు గన్‌ వీడియోలు సోషల్‌ మీడియాను ఏ స్థాయిలో షేక్‌ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా మరోసారి ప్రియా వారియర్‌ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో సినిమాటోగ్రాఫర్‌ శీను శ్రీనాథ్‌ ప్రియా వారియర్‌ కు ముద్దు పెట్టేందుకు చూడటం.. చాలా క్లోజ్‌ గా వెళ్లి తర్వాత పక్కకు తిరిగి వాటర్‌ బాటిల్‌ లోని వాటర్‌ తాగడం చేశాడు. సరదాగా చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట మళ్లీ ప్రియా వారియర్‌ ను వైరల్‌ అయ్యేలా చేసింది.

ఇద్దరు కూడా స్లో మోషన్‌ లో దగ్గరకు రావడం.. ముద్దు పెట్టుకున్నట్లే అనిపించడంతో వీడియో గురించి తెగ చర్చ జరుగుతోంది. ఈ వీడియోకు ప్రియా వారియర్‌ 'మూమెంట్‌ విత్‌ మై ఫేవరెట్‌ శీను శ్రీనాథ్‌' అంటూ క్యాప్షన్‌ పెట్టి మరీ పోస్ట్‌ చేసింది. ఈ విడియో 'ఒరు ఆదార్‌ లవ్‌' చిత్రం షూటింగ్‌ సమయంలో తీసినట్లుగా ఉంది. అప్పటి వీడియోను ఇప్పుడు ప్రియా వారియర్‌ పోస్ట్‌ చేసింది. ఈమద్య కాలంలో ప్రియా వారియర్‌ గురించి పెద్దగా చర్చ లేదు. అందుకే ఇలాంటి వీడియో పోస్ట్‌ చేసి తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నించినట్లుగా అనిపిస్తుంది.

'ఒరు ఆదార్‌ లవ్‌' చిత్రం మలయాళం మరియు తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదలైంది. కాని ఎక్కడ కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఈమె 'శ్రీదేవి బంగ్లా' అనే చిత్రంలో నటిస్తోంది. చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం అతిలోక సుందరి శ్రీదేవి జీవితంను పోలి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో ఇప్పటికే బోణీ కపూర్‌ ఆ విషయమై కోర్టులో పిటీషన్‌ కూడా వేయడం జరిగింది. శ్రీదేవి బంగ్లా వివాదాల నడుమ ఎప్పుడు విడుదల అయ్యేనో..!!