ఫోటో స్టోరి: కిస్ బ్యూటీ ఎర్రటి పెదాలు

Thu May 17 2018 17:09:58 GMT+0530 (IST)

మోడల్ గా ఫెమాస్ అయిన ప్రతి బ్యూటీ హీరోయిన్ గా సక్సెస్ అవ్వలేదు. సరైన కథలను ఎంచుకొని నటనతో ఆకట్టుకునే విధంగా ఉంటేనే వాళ్లు సక్సెస్ అవుతారు. మోడలింగ్ ఒక అడ్వాంటేజ్ అయితే అందం మరో ప్లస్ పాయింట్. మొదటి చాన్స్ ఈజీగా అందుకోవచ్చు గాని ఆ తరువాత వారి అదృష్టం బట్టి ఉంటుంది. ప్రస్తుతం ఓ బ్యూటీ పరిస్థితి కూడా అలానే ఉంది. అందంలో అమ్మడికి పెరు పెట్టాల్సిన అవసరం లేదు.సెక్సీ హీరోయిన్ అంటూ నెటీజన్స్ నుంచి మంచి ప్రశంసలను ఆందుకుంటోంది. ఆమె ఎవరో కాదు. కిస్ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ప్రియ బెనర్జీ. ఐదేళ్ల క్రితం రిలీజైన ఆ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఆ తరువాత జోరు - అసుర వంటి సినిమాల్లో అవకాశం వచ్చినప్పటికీ పెద్దగా  క్రేజ్ అందుకోలేదు. దీంతో ప్రస్తుతం ప్రియ వెబ్ సిరీస్ ల ద్వారా అదృష్టం పరీక్షించుకుంటోంది. అలాగే ఫొటో షూట్స్ తో కూడా అమ్మడు తన రేంజ్ ను పెంచుకుంటోంది.

ఇటీవల ఫోటోగ్రాఫర్ విక్రమ్ నిర్వహించిన ఫొటో షూట్ లో అమ్మడు ఇచ్చిన బికినీ స్టిల్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. లెగ్స్ అందాలను ప్రజెంట్ చేసిన విధానం కుర్రకారును చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తోంది. ఇక ఎర్రటి పెదాలు మెయిన్ ఏట్రాక్షన్ గా కనిపిస్తున్నట్లు ఉండడంతో ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేస్తున్నారు. మరి ఈ ఫొటో షూట్స్ తో అమ్మడు కొత్తగా ఏమైనా అవకాశాలను అందుకుంటుందో లేదో చూడాలి.