Begin typing your search above and press return to search.

మెగా హీరోకి పోటీ వస్తున్న ప్రిన్స్!

By:  Tupaki Desk   |   23 Oct 2016 7:26 AM GMT
మెగా హీరోకి పోటీ వస్తున్న ప్రిన్స్!
X
మెగా హీరో వరుణ్ తేజ్ తో దర్శకుడు శ్రీను వైట్ల 'మిస్టర్' మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలోకి సడెన్ గా మరో హీరో ఎంట్రీ ఇచ్చాడు. బస్టాప్.. రొమాన్స్ చిత్రాలతో గుర్తింపు సంపాదించి తర్వాత పెద్దగా కనిపించని ప్రిన్స్.. గత రెండేళ్లలో అయితే 'నేను శైలజ'మూవీలో హీరోయిన్ బ్రదర్గా కనిపించాడంతే.

ఇప్పుడీ కుర్రాడికి సూపర్బ్ ఆఫర్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలుపెట్టేశాడు. గతవారంలో ఒక రోజు షూటింగ్ చేసిన తర్వాత.. వరుణ్ తేజ్ కాలికి గాయం కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. మెగా హీరో సినిమాలో మరో హీరో అన్నంత మాత్రాన ప్రిన్స్ కేరక్టర్ ఏమీ చిన్నది కాదట. సినిమాకి కీలకంగా ఉండడమే కాదు.. ఓ హీరోయిన్ తో రొమాన్స్ కూడా చేస్తానని అంటున్నాడు ప్రిన్స్. 'శ్రీను వైట్ల సినిమాలో ఆఫర్ రావడంతో చాలా ఖుషీ అయిపోయా. మిస్టర్ లో ఈ పాత్రకు సూట్ అయ్యే యాక్టర్ కోసం 6-7 నెలల నుంచి వెతుకుతున్నారని రీసెంట్ గానే తెలిసింది. ఈ మూవీలో నాది ఇంపార్టెంట్ రోల్' అంటున్నాడు ప్రిన్స్.

'లావణ్య త్రిపాఠి.. హేభాపటేల్ లలో ఒకరికి నేను బాయ్ ఫ్రెండ్. ఎవరికి అనే విషయం ఆన్ స్క్రీన్ పై చూసి తెలుసుకోవాల్సిందే. సినిమా ఫస్టాఫ్ లోనే నా కేరక్టర్ వచ్చినా.. సెకండాఫ్ లో మాత్రం చాలా కీలకంగా మారిపోతుంది నా రోల్' అంటున్నాడు ప్రిన్స్. రెండేళ్లకు పైగా చేతిలో సినిమాలు లేక కెరీర్ ఇబ్బంది పడ్డ సమయంలో.. ప్రిన్స్ కి మెగా మూవీలో ఆఫర్ రావడం.. అది కూడా మూవీకి కీలకంగా ఉండే రోల్ కావడం. హీరోయిన్స్ లో ఒకరికి బాయ్ ఫ్రెండ్ గా వరుణ్ తేజ్ కి పోటీ ఇచ్చే రోల్ అంటే.. ప్రిన్స్ కి గుడ్ టైమ్స్ స్టార్ట్ అయినట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/