Begin typing your search above and press return to search.

మణిరత్నం అంటే జనాలకు జోకైపోయింది

By:  Tupaki Desk   |   31 Aug 2015 6:12 PM GMT
మణిరత్నం అంటే జనాలకు జోకైపోయింది
X
ఒకప్పుడు మణిరత్నం పేరు చెబితే చాలు.. చెవి కోసుకునే రేంజు ఫ్యాన్స్‌ ఉండేవారు. కాని ఇప్పుడు మాత్రం ఆయన్ను ఆదరించే ప్రేక్షకులు ఉన్నా కూడా, అభిమానించే వీరాభిమాని గణం మాత్రం పెద్దగా లేదు. పైగా ఎవరైనా రెండు హిట్లు ఇచ్చిన డైరక్టర్లు ఓ సినిమా ఫ్లాప్‌ తీస్తే మాత్రం వెంటనే ఏంటమ్మా మణిరత్నంలా తయారయ్యావ్‌ అంటూ సెటైర్లు వేయడానికి ఆయన పేరును వాడేసుకుంటున్నారు. ఇంతకీ మణి సార్‌ రేంజ్‌ అంతలా పడిపోయిందా?

నిజానికి ఈ విషయంలో మనం జనాలను తప్పుబట్టడానికి లేదు. ఎందుకంటే టెక్నాలజీ పెరుగుదల వారిని అలా ఇంప్రెస్‌ చేసింది. అప్పట్లో ఓ రొమాంటిక్‌ సీన్‌ చూడాలంటే మణి సినిమా అనేవారు. కాని ఇప్పుడు.. యుట్యూబ్‌ లోకి వెళ్ళి రొమాంటిక్‌ సీన్స్‌ అని టైప్‌ చేస్తే తెలుగు సినిమాల్లోని వివిధ రొమాంటిక్‌ సీన్ల నుండి షకీలా రొమాంటిక్‌ సీన్ల వరకు పెద్ద లిస్టే వచ్చేస్తోంది. దానితో జనాలకు ఇక మణి సార్‌ సినిమాలు చూస్తే ఆ కిక్‌ ఎక్కడొస్తుంది చెప్పండి. ఇకపోతే త్రివిక్రమ్‌ ఒక్కడు ప్రాస డైలాగులు రాస్తే, అందులోని మీనింగ్‌ తక్కువగా తీసుకొని కేవలం ప్రాస నే బేస్‌ చేసుకొనే ఎన్నో చచ్చు డైలాగులతో కూడిన సినిమాలు తెగ వస్తున్నట్లే.. మణి సార్‌ టైపులో రొమాన్స్‌ సీన్ లు అంటూ చాలామంది ఇప్పుడు అలాంటి సీన్ లు తీసేసి, ఆయన సినిమాల ఎసెన్స్‌ ను నాశనం చేశారు. దానితో మణి సార్‌ చూపించే ఆ కొద్దిపాటి రొమాన్స్‌ అనేది మనోళ్ళకు కిక్కివ్వట్లేదు.

మణి సార్‌ వీరాభిమానులెందరూ పైన చెప్పబడిన అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే నిజమని అనలేంలే. ఎందుకంటే ఒక్కో కంటెంట్‌ ఒక్కోసారి ఎందుకు క్లిక్‌ అవుతుందనేది చెప్పలేం. ఎందుకు అవుతుందో ఎందుకు అవ్వదో తెలియాలంటే.. ఓ సినిమా తీసి చేతులు కాల్చుకోవాల్సిందే. ఏదో కామెంట్‌ చేయడం, మణిరత్నంపై జోకులు వేయడం వీజీ కాని, సినిమాలు తీయడం అంటే కష్టమేలేండి.