Begin typing your search above and press return to search.

త్రి ఇడియ‌ట్స్‌ ని కొట్టేసిన స‌ల్మాన్‌

By:  Tupaki Desk   |   29 Nov 2015 6:08 AM GMT
త్రి ఇడియ‌ట్స్‌ ని కొట్టేసిన స‌ల్మాన్‌
X
మిస్ట‌ర్ పెర్ ఫెక్ట్ అమీర్‌ ఖాన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన త్రి - ఇడియ‌ట్స్ బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్ కొట్టి ఫుల్ ర‌న్‌ లో 200 కోట్లు వ‌సూలు చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌యోగాత్మ‌క కథాంశంతో తెర‌కెక్కి రికార్డ్ వ‌సూళ్లు సాధించిన సినిమా ఇది. ఇప్ప‌టికే 600 కోట్ల క్ల‌బ్ లో పికే లాంటి సినిమాలు ఉన్నా.. ఈ స్థాయి రికార్డుల్ని కొట్టే సినిమాలు త‌క్కువే. అయితే లేటెస్టుగా స‌ల్మాన్ ఖాన్ హీరోగా సూర‌జ్ బ‌ర్జాత్యా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ పాయో త్రి - ఇడియ‌ట్స్ రికార్డుల్ని కొట్టేసింది. ఈ సినిమా ఇండియా వైడ్ 203.53 కోట్లు వ‌సూలు చేసింది.

ఇప్ప‌టివ‌ర‌కూ దేశంలో టాప్ -3 మూవీస్‌ గా పీకే - భ‌జ‌రంగి భాయిజాన్‌ - బాహుబ‌లి రికార్డుల కెక్కాయి. ఆ త‌ర్వాతి స్థానంలో స‌ల్మాన్ ఖాన్ సినిమాలెన్నో టాప్ 10లో ఉన్నాయి. అయితే 2015 స‌ల్మాన్‌ కి బాగా క‌లిసొచ్చిన సంవ‌త్స‌రంగా రిజిష్ట‌ర్ అయిన‌ట్టే. ఏడాది ఆరంభ‌మే భ‌జ‌రంగి భాయిజాన్ తో సంచ‌ల‌న విజ‌యం సాధించాడు. ఆ త‌ర్వాత ఇప్పుడు .. ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ పాయో పెద్ద హిట్ట‌య్యింది. ఈ చిత్రంలో స‌ల్మాన్ ద్విపాత్రాభిన‌యం అభిమానులు స‌హా కామ‌న్ ఆడియెన్‌ ని ఆక‌ట్టుకుంది. అందుకే ఇంత పెద్ద విజ‌యం సాధ్య‌మైంది.