Begin typing your search above and press return to search.

మొగుడి ప‌రిచ‌యం కోసం భారీ పార్టీ

By:  Tupaki Desk   |   6 May 2016 4:17 PM GMT
మొగుడి ప‌రిచ‌యం కోసం భారీ పార్టీ
X
చ‌డీచ‌ప్పుడు లేకుండా పెళ్లి చేసుకుని వ‌చ్చేసిన బాలీవుడ్ భామ ప్రీతి జింతా.. ఇక ఎంతో కాలం త‌న పెళ్లి వ్య‌వ‌హారాన్ని దాచి పెట్టాల‌నుకోవ‌ట్లేదు. బాలీవుడ్ లో పెద్ద పార్టీ ఒక‌టి ఏర్పాటు చేసిన త‌న భ‌ర్త‌ను అంద‌రికీ ప‌రిచ‌యం చేయాల‌నుకుంటోంది. 41 ఏళ్ల ప్రీతి జ‌న‌వ‌రిలో అమెరికాకు చెందిన జీన్ గుడ్ ఎనఫ్ అనే వ్యాపార‌వేత్త‌ను పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఈ పెళ్లి గురించి బాలీవుడ్లో త‌న స‌హ న‌టుల‌కు.. స్నేహితుల‌కు కూడా స‌మాచారం ఇవ్వ‌లేదు ప్రీతి. కేవ‌లం ప్రీతికి అత్యంత సన్నిహితురాలైన హృతిక్ రోష‌న్ మాజీ భార్య సుసానే ఖాన్ మాత్ర‌మే ఈ పెళ్లికి హాజ‌రైంది.

ఐతే చెప్పా పెట్ట‌కుండా పెళ్లి చేసుకోవ‌డ‌మే కాక‌.. త‌న భ‌ర్తను ప‌రిచ‌యం కూడా చేయ‌క‌పోవ‌డంపై బాలీవుడ్లో ప్రీతి స‌న్నిహితులంద‌రూ దెప్పిపొడుస్తున్నార‌ట‌. ఈ మ‌ధ్య స‌ల్మాన్ ఖాన్ సైతం ఈ విష‌యంలో ప్రీతిపై సెటైర్లు గుప్పించాడ‌ట‌. దీంతో ఇక లాభం లేద‌ని.. ఓ భారీ పార్టీ ఏర్పాటు చేసి.. బాలీవుడ్ ప్ర‌ముఖుల‌కు త‌న భ‌ర్త గుడ్ ఎన‌ఫ్ ను ప‌రిచ‌యం చేయాల‌ని ఫిక్స‌యింద‌ట ప్రీతి. ఇది థీమ్ బేస్డ్ పార్టీ అంటున్నారు. త్వ‌ర‌లోనే ఈ పార్టీకి తేదీని ప్ర‌క‌టించ‌నుంద‌ట ప్రీతి.

దాదాపు ద‌శాబ్దంన్న‌ర‌పాటు హీరోయిన్ గా కొన‌సాగిన ప్రీతి.. త‌ర్వాత తన దృష్టిని ఐపీఎల్ మీదికి మ‌ళ్లించింది. ఆ జ‌ట్టు య‌జ‌మాని నెస్ వాడియాతో ప్రేమాయ‌ణం న‌డిపి.. జ‌ట్టు భాగ‌స్వామిగానూ మారిన ప్రీతి.. త‌ర్వాత అత‌డి నుంచి విడిపోయింది.