వెడ్డింగ్ ఫోటోలను అలా వాడుతుందట

Wed Jun 13 2018 15:20:19 GMT+0530 (IST)

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎంత గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం వ్యాపారవేత్తగా కొనసాగుతున్న బ్యూటీ ప్రీతీ జింటా. ఓ సారి.. ఆమె పేరు ప్రీతీ z జింటా కథా. 2016 లో అమ్మడు ఒక యూఎస్ కు చెందిన బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. జీనీ గుడ్నఫ్ అనే విదేశీయుడిని అమ్మడు అప్పట్లో చాలా సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. పెళ్లి జరిగిన తరువాత గాని ఆ విషయం నిజమని ఎవరు  నమ్మలేదు.



బాలీవుడ్ బ్యూటీ పెళ్లి గురించి ఎన్నో రూమర్స్ వచ్చిన ఫైనల్ గా ఆ ఏడాది పెళ్లి చేసుకొని అన్ని రూమర్స్ కి చెక్ పెట్టింది. ఆ విషయం పక్కనపెడితే. పెళ్లి జరిగిందని ప్రీతీ క్లారిటీ ఇచ్చినప్పటికీ ఆమె వెడ్డింగ్ కు సంబందించిన పోటోలను ఎక్కువగా మీడియాకు వదల్లేదు. కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కకానీ అవి ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు. ఇకపోతే ఇప్పుడు ప్రీతీ కొన్ని ఫోటోలను రిలీజ్ చేస్తాను అని అంటోంది. కాకపోతే వేలం పాట ద్వారా తన ఫోటోలను రిలీజ్ చేస్తాను అని ప్రీతీ చెప్పడం గమనార్హం.

అయితే వేలంతో వచ్చిన డబ్బులను అమ్మడు ఒక మంచి పనికి ఉపయోగిస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన ఛారిటీలకు ఆ డబ్బును అందిస్తానని చెప్పడంతో ఆసక్తిగా మారింది. మరి ప్రీతీ తన ఫోటోలను ఏ రేంజ్ అమ్ముతుందో చూడాలి. ఇక ప్రీతీ ప్రస్తుతం ఐపీఎల్ లో పంజాబ్ జట్టుకు యజమానురాలిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.