Begin typing your search above and press return to search.

వీడియో​ లో అడ్డంగా దొరికిన ప్రీతిజింటా!

By:  Tupaki Desk   |   21 May 2018 6:21 AM GMT
వీడియో​ లో అడ్డంగా దొరికిన ప్రీతిజింటా!
X
ఐపీఎల్ లో జ‌ట్లు చాలానే ఉన్నా.. ఏ య‌జ‌మానికి సంబంధించిన వార్త‌లు పెద్ద‌గా క‌నిపించ‌వు. వారి జ‌ట్ల‌కు సంబంధించిన వార్త‌లే వ‌స్తుంటాయి. దీనికి మిన‌హాయింపుగా చెప్పాలి బాలీవుడ్ బ్యూటీ.. ఐపీఎల్ టీమ్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కో ఓన‌ర్ ప్రీతిజింటా. సొట్ట బుగ్గ‌ల ఈ సోయ‌గం.. ఇటీవ‌ల కాలంలో వివాదాల‌తో ముడేసిన వార్తల్లో ద‌ర్శ‌న‌మిస్తున్నారు. తాజాగా ఆమె.. ఒక కామెంట్ చేస్తూ.. వీడియో సాక్షిగా దొరికిపోయారు.

సోష‌ల్ మీడియాలో హ‌డావుడి చేస్తున్న ఈ వీడియోపై ప‌లువురు క్రీడాభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆదివారం చెన్నై-పంజాబ్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ కు హాజ‌రైన ప్రీతి.. ముంబ‌యి ఇండియ‌న్స్ జ‌ట్టుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ట్లుగా ఉన్న ఓ వీడియో క‌ల‌క‌లం రేపుతోంది.

ఈ వీడియో క్లిప్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో ముంబ‌యి ఇండియ‌న్స్ ప‌ద‌కొండు ప‌రుగుల తేడాతో ఓడి.. ప్లేఆఫ్ రేస్ నుంచి త‌ప్పుకున్నారు. ఈ విష‌యం తాను ఫుణేలో ఉన్న‌ప్పుడు తెలిసింద‌ని.. అందుకు తాను చాలా సంతోషంగా ఉన్న‌ట్లుగా చెప్పిన వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

నేనుచాలా సంతోషంగా ఉన్నాను.. ముంబ‌యి ఫ్లేఆఫ్స్ రేస్ నుంచి త‌ప్పుకుంది. చాలా హ్యాపీగా ఉందంటూ త‌న పక్క‌నున్న వ్య‌క్తికి చెప్ప‌టం.. అత‌నికి హైఫై కొట్ట‌టం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఈ మాట‌ల్ని ఇంగ్లిషులో అంటున్న వైనం టీవీల్లోనూ టెలికాస్ట్ అయ్యింది. దీన్ని మొబైల్ వీడియో తీసిన ఒక అభిమాని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే ఢిల్లీలో జ‌రిగిన మ్యాచ్ లో ముంబ‌యి ఇండియ‌న్స్ ఓడిపోవాల‌ని.. అదే స‌మ‌యంతో త‌మ పంజాబ్ జ‌ట్టు ఆదివారం మ్యాచ్ లో గెలిస్తే.. తేలిగ్గా మ‌రింత ముందుకు వెళ్లొచ్చ‌న్న‌ది ప్రీతి ఆలోచ‌న‌. అయితే.. ముంబ‌యి ఇండియ‌న్స్ ను ఓడిపోవ‌టానికి సంబ‌ర‌ప‌డిన ఆమె.. త‌న జ‌ట్టు ఆదివారం జ‌రిగిన మ్యాచ్ లో ఓడిపోవ‌టం ద్వారా ప్లేఆఫ్ రేస్ నుంచి నిష్క్ర‌మించింది. ఎదుటోడు చెడిపోవాల‌నుకునే వాడు.. తాను కూడా చెడిపోతాడ‌న్న మాట‌కు త‌గ్గ‌ట్లే తాజాగా ప్రీతిజింటా తీరు ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇక‌.. ప్రీతి సంబ‌రాన్ని ముంబ‌యి ఇండియ‌న్స్ జ‌ట్టును అభిమానించే వారు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.