అయ్యో.. జీన్స్ పట్టట్లేదంట

Thu May 17 2018 18:08:36 GMT+0530 (IST)


బాలీవుడ్ బెస్ట్ కపుల్స్ లో హీరో షాహిద్ కపూర్ - మీరా రాజ్ పుత్ ల జంట ఒకటి. లవ్ మ్యారేజ్ తో ఒక్కటైన వీరిద్దరూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. తమకు సంబంధించిన విశేషాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులకు షేర్ చేస్తూనే ఉంటారు. వీళ్లిద్దరికి ఇప్పటికే మిషా అనే కుమార్తె ఉంది.తాజాగా షాహిద్ కపూర్ - మీరా రాజ్ పుత్ ల జంట తమ కుటుంబంలోకి కొత్త మెంబర్ వస్తున్నట్లు ప్రకటించారు. తమ కుమార్తె మిషా అక్క కాబోతోందనే సంతోషకరమైన విషయాన్ని మీరా రాజ్ పుత్ కూతురుతో సహా ఇన్ స్టాగ్రామ్ లో ఫొటో పెట్టి మరీ షేర్ చేసింది. ‘‘ఈ టైంలో మామూలు జీన్స్ వేసుకోవడం కుదరదు. పోనీ మెటర్నిటీ జీన్స్ వేసుకుందామని అవి మరీ పెద్దవైపోతాయ్’’ అంటూ తన సిట్యుయేషన్ ఫన్నీగా వివరిస్తూ పోస్టు కూడా పెట్టింది మీరా. ఈ పోస్టు చూసిన నెటిజన్లలోని కాబోయే తల్లులు తమ పరిస్థితీ ఇదేనంటూ రెస్పాండయ్యారు.

‘‘మీరా ప్రెగ్నెంట్ కావడం రెండోసారి కాబట్టి మొదటిసారి అంత టెన్షన్ లేదు. కానీ కుటుంబంలోకి కొత్తగా బుజ్జి పాపాయి వస్తుందనే మాట వినడానికి చాలా బాగుంది. ఆనందంగా ఉంది’’ అంటూ షాహిద్ తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఈ ఏడాది పద్మావత్ సినిమాతో పేరు తెచ్చుకున్న ఈ హీరో తరవాత ‘‘బత్తీ గుల్ మీటర్ చాలూ’’ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో షాహిద్ తొలిసారి లాయర్ రోల్ చేస్తున్నాడు.