Begin typing your search above and press return to search.

పాపం పాప.. పెళ్లికి రెడీ అయిపోయింది

By:  Tupaki Desk   |   26 July 2016 5:20 AM GMT
పాపం పాప.. పెళ్లికి రెడీ అయిపోయింది
X

పెళ్లి చేసుకుంటోందని జాలి చూపించడం కాదండీ.. రామ్ చరణ్ తో కలిసి ఐటెం సాంగ్ లో కనిపించిన భామ స్కార్లెట్ విల్సన్. అయ్యో పాపం.. అయ్యయ్యయ్యో పాపం.. అంటూ సాగే ఈ పాటలో అందరూ ఈమెపై జాలి పడిపోతూ ఉంటారు. ఆ బ్రిటిష్ మోడల్ స్కార్లెట్ ఇప్పుడు పెళ్లి చేసేసుకుంటోంది.

2008 మిస్టర్ ఇండియా ప్రవేష్ రాణా పెళ్లి కొడుకు కాగా.. ఆగస్ట్ 25న ఈ పెళ్లి జరగనుంది. మ్యారేజ్ ఇక్కడ కాదు.. లండన్ లోనే గ్రాండ్ గా సెలబ్రేట్ చేయనున్నారు. అన్నట్లు.. ఇతను కూడా యాక్టర్ అనే విషయం చెప్పుకోవాలి. టాలీవుడ్ లో బాహుబలి సహా పలు మూవీస్ లో ఐటెం సాంగ్స్ చేసిన స్కార్లెట్ ను.. ఆరేళ్ల క్రితమే కలిశాడట ప్రవేష్. 'ఆమె కూడా ఇదే పరిశ్రమకు చెందిన వ్యక్తి కావడంతో ఇది సులభమైంది. నేను జీఈసీ కోసం ఓ డ్యాన్స్ షో చేస్తున్నపుడు మేం ఆరేళ్ల క్రితమే కలుసుకున్నాం. ఇది పెళ్లికి సరైన సమయం అని భావించడంతో ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్నాం' అంటున్నాడు ప్రవేష్ రాణా.

పశ్చిమ యూపీకి చెందిన ఇతను.. అక్కడి నుంచి లండన్ కు ఓ 50 మంది వరకూ తీసుకెళ్లి పెళ్లి చేసుకోబోతున్నాడట. అలాగే లండన్ నుంచి స్కార్లెట్ వాళ్ల పేరెంట్స్ మీరట్ వచ్చి పూజలు చేయబోతున్నారని తెలుస్తోంది. మొత్తానికి అయ్యో పాపం పాపకి.. పెళ్లి ఫిక్సయిపోయింది.