రాజశేఖర్‌కు దర్శకుడి క్లీన్ సర్టిఫికెట్

Tue Dec 18 2018 17:33:11 GMT+0530 (IST)

యాంగ్రీ యంగ్ మన్ రాజశేఖర్ చాలా సంవత్సరాల తర్వాత ‘గరుడవేగ’ అనే చిత్రంతో సక్సెస్ ను దక్కించుకున్నాడు. ఆయన ప్రస్తుతం ‘కల్కి’ అనే చిత్రాన్ని ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతున్న ఈ సమయంలో సినీ వర్గాల్లో ఒక పుకారు తెగ చక్కర్లు కొడుతోంది. ‘కల్కి’ చిత్రం మేకింగ్ విషయంలో రాజశేఖర్ ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువ అయ్యిందని ఆయన ఇన్వాల్వ్ మెంట్ తో దర్శకుడు చిరాకు పడుతున్నాడు అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.ఇప్పుడే కాకుండా గతంలో కూడా డైరెక్షన్ లో రాజశేఖర్ ఇన్వాల్వ్ అవుతాడని - దర్శకుల పనిలో కల్పించుకుంటాడని  పుకార్లు వచ్చాయి. తాజాగా రాజశేఖర్ పై ఉన్న ఈ అపవాదుపై దర్శకుడు ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చాడు. రాజశేఖర్ గారి గురించి మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా కూడా అబద్దమే అని -  ఆయనంత స్వీట్ పర్సన్ ను నేను ఇంత వరకు చూడలేదు. కెమెరా ముందుకు వెళ్లగానే నేను ఏది చెబితే అది ఎస్ సర్ అంటూ చేసుకుంటూ వెళ్తాడు. నాకు ఏదైతే కావాలో అది ఇచ్చేందుకు మ్యాగ్జిమం ప్రయత్నిస్తాడు.

రాజశేఖర్ దర్శకత్వం విషయంలో ఏమాత్రం ఇన్వాల్వ్ అవ్వడం లేదు అంటూ ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇవ్వడంతో గత కొన్ని రోజులుగా వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పడ్డట్లయ్యింది. ఈ చిత్రం 1980 నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. ఈ చిత్రం కోసం 2 కోట్లతో భారీ సెట్టింగ్ ను నిర్మించారు. సినిమాలోని మెజార్టీ పార్ట్ అక్కడే చిత్రీకరించబోతున్నారు. వచ్చే ఏడాదిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.