Begin typing your search above and press return to search.

వాట్ ఏ సెక్సీ సెల్ఫీ బ్యూటీస్

By:  Tupaki Desk   |   5 Jan 2018 5:03 AM GMT
వాట్ ఏ సెక్సీ సెల్ఫీ బ్యూటీస్
X
పోజులు ఇచ్చి ఫోటోలు దిగడం కొత్తేమీ కాదు. అందాల భామలు ఈ విషయంలో మరీ ట్యాలెంట్ చూపించేస్తూ ఉంటారు. ఇక ఈవెంట్స్ లో అయితే ముద్దుగుమ్మలు మరీ రెచ్చిపోతూ ఉంటారు. ఒకరిని మించి ఒకరు సోయగాలను ప్రదర్శిస్తూ.. ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారు. కానీ ఛాన్స్ దొరికితే మాత్రం ఒకరికి ఒకరు అన్న తరహాలో మాటలు చెప్పేస్తారు. అడపా దడపా పాత వైరాలను పక్కన పెట్టి తెగ నటించేస్తారు కూడా.

రీసెంట్ గా జరిగిన ఓ ఈవెంట్ లో ఇద్దరు కన్నడ ముద్దుగుమ్మలు కలిసి ఫోటో దిగడం హాట్ టాపిక్ అయింది. బాపుబొమ్మగా టాలీవుడ్ లో గుర్తింపు పొందిన అత్తారింటికి దారేది బ్యూటీ ప్రణీతా సుభాష్.. మరో శాండల్ వుడ్ వయ్యారి షర్మిలా మాండ్రేతో కలిసి ఫోటో తీసుకుంది. వీరిద్దరికీ కన్నడనాట బోలెడంత క్రేజ్ ఉండగా.. ఇలా ఒక సుందరితో కలిసి మరో బ్యూటీ సెల్ఫీ తీసుకోవడం అరుదు అనే చెప్పాలి. ఈ షర్మిలా మాండ్రే కూడా తెలుగులో ప్రయత్నించిన భామే. కెవ్వుకేక మూవీలో మహాలక్ష్మి పాత్రలో తెలుగు ఆడియన్స్ ను అలరించే ప్రయత్నం చేసింది.

ఈ సెక్సీ సెల్ఫీలో ప్రణీతా సుభాష్ మరీ మెరిసిపోతోంది. స్లీవ్ లెస్ డ్రెస్.. వయ్యారాలు ప్రదర్శించే లోనెక్ బ్లాక్ వేర్ లో ఈ భామ భలే సెక్సీగా ఉంది. ఇక నిండుగా డ్రెసింగ్ చేసుకున్నా షర్మిల కూడా చూడముచ్చటగానే ఉంది. ప్రస్తుతం ఈ వయ్యారి భామలకు తెలుగులో అంతగా అవకాశాలు లేవు కానీ.. సరైన ఆఫర్ మరొకటి వస్తే ట్యాలెంట్ చూపించేందుకు సర్వదా సిద్ధం అనే సిగ్నల్స్ గతంలోనే పంపారులే.