Begin typing your search above and press return to search.

దెబ్బలు తగిలించుకున్న బాపు బొమ్మ

By:  Tupaki Desk   |   28 Aug 2015 1:41 AM GMT
దెబ్బలు తగిలించుకున్న బాపు బొమ్మ
X
కన్నడ భామ ప్రణీత అత్తారింటికి దారేది తర్వాత బాగా బిజీ అయిపోయింది. తెలుగు,తమిళ, కన్నడ భాషల్లో తెగ సినమాలు చేసేస్తోంది. మంచు విష్ణుతో ప్రణీత నటించిన డైనమైట్ ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయింది. తన కేరక్టర్ కి దగ్గరగా ఉండే మోడ్రన్ గర్ల్ పాత్రను పోషించిందిట ఈసినాలో. ఫార్వర్డ్ థింకింగ్ ఉండే అమ్మాయి... తనకు ఎదురైన ఇబ్బందులను ఎలా ఎదుర్కొందో అన్నదే డైనమైట్ స్టోరీ అంటోది ప్రణీత.

ఇప్పటికీ ఈ సుందరాంగికి సెకండ్ హీరోయిన్ ఛాన్సులే వస్తున్నాయి. అయినా సరే తన కేరక్టర్ కి ఇంపార్టెన్స్ ఎంత చిన్న రోల్ అయినా చేస్తానంటూ... ప్రొఫెషనలిజం ప్రదర్శిస్తోంది ప్రణీత. పాండవులు పాండవులు తుమ్మెద తర్వాత.. మంచు కాంపౌండ్ లో ఈమె నటిస్తున్న రెండో సినమా డైనమైట్. హాలీవుడ్ మూవీస్ ప్రభావం హీరో విష్ణుపై ఎక్కువగా ఉంటందని, మంచి యాక్టర్ అని పొగిడేస్తోంది. స్ర్కిప్ట్ విషయంలో పక్కాగా ఉంటాడని, కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా తీయడంలో దేవ్ కట్టా ఎక్స్ పర్ట్ అని డైరెక్టర్ పై ప్రశంసలు కురిపించింది ప్రణీత.

సుకుమారిలా కనిపించే ప్రణీత... డైనమైట్ యాక్షన్ ఇరగదీసిందట. హీరోతో పాటు సినిమా అంతా ట్రావెల్ అవుతూ ఉండే కేరక్టర్ కావడంతో... ఫైట్స్ కూడా చేయాల్సి వచ్చిందని చెప్పింది ప్రణీత. ఇందులో భాగంగా కాసిని దెబ్బలు కూడా తగిలాయట. పోన్లే... దెబ్బలు తగిలినా.. హిట్టొస్తే అంతే చాలు.. కదా ప్రణీతా...ఇంతకీ డైనమైట్ ఎవరో చెప్పమంటే మాత్రం.. అబ్బా తూచ్ అంటోంది.