Begin typing your search above and press return to search.

ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డ్డ ప్ర‌ణీత‌

By:  Tupaki Desk   |   14 Feb 2016 7:23 AM GMT
ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డ్డ ప్ర‌ణీత‌
X
క‌థానాయిక ప్ర‌ణీత అదృష్ట‌వ‌శాత్తూ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది. ఖ‌మ్మం నుంచి ఆమె హైద‌రాబాద్‌ కి వ‌స్తుండ‌గా మోతి అనే గ్రామం ద‌గ్గ‌ర ప్ర‌ణీత ప్ర‌యాణిస్తున్న కారు బోల్తా ప‌డింది. కారు ప‌ల్టీలు కొడుతూ రోడ్డు ప‌క్క‌న ప‌డిపోయింది. ఆ ప్ర‌మాదం జ‌రిగిన ప్ర‌దేశాన్ని చూస్తే క‌చ్చితంగా ఇద్ద‌రు ముగ్గురు ప్రాణాలైనా పోయుంటాయ‌నిపిస్తుంది. కానీ ప్ర‌ణీత మాత్రం అదృష్ట‌వ‌శాత్తూ చిన్న గాయాల‌తో బ‌య‌ట‌ప‌డింది. నిన్న రాత్రి ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌రిగిన సీసీఎల్ క్రికెట్ మ్యాఛ్‌ కి హాజ‌రైంది ప్రణీత‌. అందులో ఆట‌గాళ్ల‌ని ఎంకరేజ్ చేస్తూ ఉత్సాహంగా క‌నిపించింది.

ఉద‌య‌మే ఖ‌మ్మంకి వెళ్లి అక్క‌డ జ‌రిగిన ఓ ప్ర‌యివేటు ఫంక్ష‌న్‌ లో పాల్గొన్న‌ట్టు తెలిసింది. ఈ రోజు 2.30 గంట‌ల‌కి మొద‌వ‌ల‌వుతున్న సీసీఎల్ ఫైన‌ల్ మ్యాచ్‌ కి మ‌ళ్లీ హాజ‌ర‌య్యేందుక‌ని వెంట‌నే ఖ‌మ్మం నుంచి బ‌య‌ల్దేరింది. ఇంత‌లో మోతి అనే గ్రామం ద‌గ్గ‌ర రోడ్డు ప్ర‌మాదానికి గురైంది. తృటిలో ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకొని క్షేమంగా ఉన్నాన‌ని, కానీ ఆ షాక్ నుంచి మాత్రం ఇంకా తేరుకోలేద‌ని ప్ర‌ణీత ట్వీట్ చేసింది.