Begin typing your search above and press return to search.

గ్లామర్ గాళ్ గా.. మళ్ళీ బిజీ అవుతా

By:  Tupaki Desk   |   24 May 2018 6:06 AM GMT
గ్లామర్ గాళ్ గా.. మళ్ళీ బిజీ అవుతా
X
సౌత్ క్యూట్ బ్యూటీగా తనకంటూ ఒక స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ప్రణీత సుభాష్. గత కొన్నేళ్లుగా అమ్మడు ప్రతి ఇండస్ట్రీలో చాలా బిజీ అవుతోంది. స్టార్ హీరోలతో నటించే అవకాశం వచ్చిందంటే చాలు పాత్ర నిడివి ఎంత సేపు అనే విషయాన్ని గురించి ఆలోచించకుండా ఓకే చేస్తోంది. మరో హీరోయిన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి అమ్మడు ఏ మాత్రం ఇబ్బందిపడటం లేదు. ఇకపోతే ప్రణీత టాలీవుడ్ జనాలకు కనిపించి చాలా కాలమవుతోంది.

చివరగా మహేష్ - బ్రహ్మోత్సవం సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో అమ్మడి లెవెల్ తగ్గిపోయింది అనే టాక్ వచ్చింది. ఇక మళ్లీ ఆమె అదృష్టం బావుండి చాలా కాలం తరువాత ఒక మంచి ఆఫర్ దక్కింది. రామ్ - త్రినాథరావు రావు నక్కిన కాంబినేషన్ లో వస్తున్న హలో గురు ప్రేమ కోసమే అనే సినిమాలో ప్రణీత ఒక స్పెషల్ రోల్ లో కనిపించనుంది. అయితే సినిమాలోని ఆ పాత్ర గురించి అమ్మడు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక వివరణ ఇచ్చింది.

ప్రణీత మాట్లాడుతూ.. ఈ సినిమాతో తప్పకుండా మళ్లీ టాలీవుడ్ లో బిజీ అవుతాను. నాకు కథపై చాలా నమ్మకం ఉంది. నా పాత్ర కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో ఒక సాఫ్ట్ వెర్ ఎంప్లాయ్ గా కనిపిస్తాను. గర్ల్ - నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ లా చాలా సింపుల్ గా ఉంటుంది. గ్లామర్ గర్ల్ గా కూడా కనిపిస్తాను అని ప్రణీత వివరించింది. హలో గురు ప్రేమ కోసమే సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతో ప్రణీత ఎంతవరకు రికవర్ అవుతుందో చూడాలి.