Begin typing your search above and press return to search.

కొడుకుతో కలిసి దొరికిపోయిన ప్రకాష్ రాజ్

By:  Tupaki Desk   |   28 Aug 2016 7:49 AM GMT
కొడుకుతో కలిసి దొరికిపోయిన ప్రకాష్ రాజ్
X
దాదాపు రెండు దశాబ్దాల పాటు తీరిక లేకుండా పని చేశాడు ప్రకాష్ రాజ్. ఇటు తెలుగు.. అటు తమిళం.. మరోవైపు కన్నడ.. ఇలా మూడు భాషల్లోనూ ఆయన బిజీ ఆర్టిస్టుగా ఉన్నారు. రోజుకు రెండు షిఫ్టుల్లోనూ పని చేశారు. అలా వందల సంఖ్యలో సినిమాలు చేసి అలసిపోయిన ప్రకాష్ రాజ్ కు ఇన్నాళ్లకు తీరిక దొరికింది. అవకాశాలు తగ్గిపోయి ఖాళీ అయ్యారు. ఇందుకు ఆయనేమీ చింతించట్లేదు. వ్యక్తిగత జీవితాన్ని హాయిగా ఆస్వాదిస్తున్నారు. ఈ ఏడాది ఆయన మరో బిడ్డకు తండ్రి అయిన సంగతి తెలిసిందే. ఆయన భార్య.. ఒకప్పటి డ్యాన్స్ మాస్టర్ పోనీ వర్మ మగ బిడ్డకు జన్మనిచ్చింది. తన కొడుకు ఫస్ట్ లుక్ ను కొన్ని రోజుల కిందటే పరిచయం చేశాడు ప్రకాష్ రాజ్.

తాజాగా తన భార్య.. కొడుకుతో కలిసి దుబాయిలో సేదదీరి వచ్చాడు ప్రకాష్ రాజ్. ఈ సందర్భంగా ఓ మాల్ లో కొడుకును స్టోలర్ మీద కూర్చోబెట్టి తీసుకొస్తూ కెమెరా కంటికి చిక్కాడు ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ ఈ వయసులో తన బుల్లి కొడుకుతో కలిసి వస్తున్న ఫొటో ఆసక్తి రేపుతోంది. ప్రకాష్ రాజ్ కు పోనీ వర్మ రెండో భార్య అన్న సంగతి తెలిసిందే. ఆయన మొదటి భార్య పేరు లలితా కుమారి. ఆమెతో ఇద్దరు అమ్మాయిల్ని కన్న ప్రకాష్ రాజ్.. కొన్నేళ్ల కిందట తన నుంచి విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత పోనీ వర్మ ప్రేమలో పడ్డాడు. పెళ్లి చేసుకున్నాడు. ప్రకాష్ రాజ్ ప్రస్తుతం తెలుగు.. కన్నడ భాషల్లో ‘మనవూరి రామాయణం’ అనే సినిమా పూర్తి చేశాడు. అలాగే హిందీలో ‘తడ్కా’ అనే సినిమా కూడా తీస్తున్నాడు.