ప్రశ్నించే హక్కు ఉంది

Sat Oct 21 2017 23:17:25 GMT+0530 (IST)

సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు రాజకీయాలకు సినిమాలకు మధ్య కనెక్షన్ బాగా పెరుగుతోంది. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ జనసేనతో కొనసాగుతుంటే.. కోలీవుడ్ లో ఇంకా హీరోలు డైరెక్ట్ ఎటాక్ స్టార్ట్ చేయలేదు. అక్కడ రజినీకాంత్.. కమల్ హాసన్ పొలిటికల్ ఎంట్రీకి ఏర్పాట్లు జరుగుతున్నాయని మీడియాలలో కథనాలు వెలువడుతున్నాయి. ఇక రజినీకాంత్ సస్పెన్స్ కి గురి చేస్తుండగా.. కమల్ హాసన్ మాత్రం ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. త్వరలోనే తన సొంత పార్టిని స్థాపించబోతున్నట్లు క్లియర్ గా క్లారిటీ ఇచ్చాడు.అయితే ఈ మధ్య నేషనల్ లెవల్ నటుడు కూడా రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకోవడానికి డైరెక్ట్ గా ప్రధానమంత్రి మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయన ఎవరో కాదు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య విషయంలో మోడీ పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాను రాజకీయాల్లోకి రావడానికి ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నాను అని చెప్పడం కరెక్ట్ కాదని తెలిపారు.

అదే విధంగా తను రాజకీయాల్లోకి రావలనుకుంటే డైరెక్ట్ గా బరిలోకి దిగుతానని చెప్పారు. దేశంలో ఒక పౌరుడిగా ప్రశ్నించే హక్కు తనకు ఉందని కుల మతాల గురించి ఏ మాత్రం పట్టించుకోనని తెలిపారు. ఒక యాక్టర్ కి కూడా సామాజిక బాధ్యత ఉంటుందని కూడా ప్రకాష్ రాజ్ వివరించారు. ప్రస్తుతం నేనున్న సమాజంలో సమాజం పట్ల తనకు కూడా బాధ్యత ఉందంటూ.. తప్పు జరిగినపుడు ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుందని కూడా ప్రకాశ్ రాజ్ తెలిపారు.