Begin typing your search above and press return to search.

విలక్షణ నటుడు.. కేరాఫ్‌ నాలుగు పాత్రలు

By:  Tupaki Desk   |   26 Sep 2016 5:44 AM GMT
విలక్షణ నటుడు.. కేరాఫ్‌ నాలుగు పాత్రలు
X
ఏ నటుడి యాక్టింగ్ కి చిన్నపాటి వంక పెట్టడానికి కూడా కుదరదు అనే క్వశ్చన్ ఎదురైతే.. తెలుగు తమిళ్ భాషల అడియన్స్ అందరూ కలిసి ఏక కంఠంతో ఇచ్చే ఆన్సర్.. ప్రకాష్ రాజ్. అంతగా సినిమాలను కేరక్టర్లను తన భుజంపై మోసేసే ప్రకాష్ రాజ్.. ఇప్పుడు దర్శకుడిగా మారి.. విభిన్నమైన సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం మన ఊరి రామాయణం పేరుతో ప్రకాష్ రాజ్ నటించి నిర్మించి.. దర్శకత్వం వహించిన మూవీ.. రిలీజ్ కి రెడీ అయింది.

ట్రైలర్ తో ఎంతో ఆసక్తిని రేకెత్తించిన ఈ మూవీ.. పౌరాణిక గ్రంధం రామాయణంలోని నాలుగు పాత్రలను పోలి ఉంటుందని అంటున్నారు. ఓ ఎన్నారై.. ఓ ఎస్కార్ట్(వేశ్య.. కాల్ గాళ్ టైపులోనే.. ఇంకొంచెం డిగ్నిఫైడ్ అంతే) పాత్రలో ప్రియమణి.. అలాగే ఓ రిక్షావాలా.. ఓ మూవీ డైరెక్టర్.. వీళ్ల మధ్య నడిచే కథే ఈ సినిమా అని తెలుస్తోంది. నాలుగు పాత్రలు ఓ చోట కలవక తప్పని పరిస్థితి. మన ఊరి రామాయణంలో ప్రధాంగా కనిపించే ఈ నాలుగు పాత్రలే.. సినిమాను ఆద్యంతం నడిపిస్తాయంటున్నాడు ప్రకాష్‌. ''ఒక వేళ రాముడు రావణుడుగా మారినా.. రాముడికి పరమ భక్తుడైన హనుమంతుడి ప్రవర్తనల మార్పు రాకుండా అలానే ఉంటే'' అనే ఆలోచన చుట్టూనే సాగుతుందట ఈ మూవీ.

ఇళయరాజా సంగీతం అందిచిన ఈ చిత్రం.. అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ నాలుగు పాత్రలూ జనాలను ఆకట్టుకుని.. ప్రకాష్‌ లోని డైరక్టర్ కు ఈసారైనా ప్రేక్షకుల చేత మార్కులు వేయిస్తాయా? ఇప్పటివరకు ధోని, ఉలవచారూ బిర్యాని వంటి సినిమాలను డైరక్ట్ చేసిన ఈ విలక్షణ నటుడు.. ఒక్కసారి కూడా దర్శకుడిగా శభాష్‌ అనిపించుకోలేదు. ఇప్పుడు ఆయన ఫ్యూఛర్ అంతా కేరాఫ్‌ ఈ నాలుగు పాత్రలనే చెప్పాలి.