మహేష్ తండ్రిగా మళ్ళీ ప్రకాష్ రాజ్

Tue Jun 19 2018 17:18:47 GMT+0530 (IST)


మహేష్ బాబు తన సినిమాలలో చాలా వరకు హీరోయిన్లను రిపీట్ చేయడు. కాని సపోర్టింగ్ ఆర్టిస్టులు మాత్రం చాలా వరకు రిపీట్ అవుతారు. అందులో ప్రకాష్ రాజ్ ఒకరు. మహేష్ బాబు - ప్రకాష్ రాజ్ కలిసి ఇప్పటికి చాలానే సినిమాలు చేశారు. ఒక్కడు సినిమా నుండి భరత్ అనే నేను వరకు చాలా సినిమాలకు కలిసి పనిచేశారు.కొన్ని సినిమాలలో హీరో విలన్ లాగా ఒకరితో ఒకరు తల పడ్డారు మరో సినిమాలో పోలీస్ క్రిమినల్ లాగా దాగుడుమూతలు ఆడారు. అలానే తండ్రి కొడుకులలా కూడా మనల్ని మెప్పించారు. ఇప్పుడు మళ్లీ అలానే అదే బంధంతో మన ముందుకు రాబోతున్నారు. మహేష్ తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ ఇప్పటికి ఒక రెండు సినిమాలలో కనిపించారు. అవి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మరియు దూకుడు. ఇప్పుడు మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్టు తెలిసిందే.

టైటిల్ ఇంకా ఖరారు కానీ ఈ సినిమాను మహేష్ 25 అని పిలుస్తున్నారు. ఆ సినిమాలో మహేష్ తండ్రి పాత్ర ప్రకాష్ రాజ్ పోషించనున్నారు. కొంత భాగం యుఎస్ బాక్ డ్రాప్ మరో భాగం రాయలసీమలో నడవనుంది. ఇందులో మహేష్ ఎంబీఏ స్టూడెంట్ గా కనిపించనున్నాడు. ఇప్పటిదాకా వీరు తండ్రి కొడుకులుగా కనిపించిన రెండు సినిమాలు హిట్లే. అలానే ఈ సినిమా కూడా హిట్ అవుతుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.