ప్రగ్య ప్రచారం ఏ మేరకు ప్రయోజనమో

Tue Apr 24 2018 23:00:02 GMT+0530 (IST)

మూడేళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా.. ఇంకా తనకంటూ ఓ స్థానాన్ని క్రియేట్ చేసుకోలేకపోయింది మధ్యప్రదేశ్ భామ ప్రగ్యా జైస్వాల్. కంచె అంటూ క్రిష్ తీసిన మెగా హీరో మూవీతో వచ్చిన గుర్తింపును.. క్యాష్ చేసుకోవడంలో ప్రగ్య ఫెయిల్ అయింది. అయితే.. ఇప్పటికీ ఈమె చేతిలో కొన్ని ఛాన్సులు ఉండగా..వీటిలో ఒకటి మంచు విష్ణుతో కలిసి నటించిన ఆచారి అమెరికా యాత్ర.ఈ నెల 27న థియేటర్లలోకి వస్తున్నాడు ఆచారి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రగ్యా జైస్వాల్.. ఇప్పుడు హడావిడిగా హైద్రాబాద్ వచ్చేసి మరీ ప్రచారం చేస్తోంది. మంచు విష్ణు-బ్రహ్మీ కాంబోకు ఉన్న క్రేజ్ బేస్ చేసుకుని.. ఈ సినిమా హిట్టు సాధిస్తుందన్నది ఈమె కాన్ఫిడెన్స్. పూర్తిగా ఫన్ యాంగిల్ తో రూపొందిన ఆచారి విజయం సాధించడం ఇప్పుడు చాలా సంక్లిష్టమైన వ్యవహారం అయిపోతోంది. పెద్ద సినిమాల మధ్యలో పడడం.. అవెంజర్స్ లాంటి క్రేజీ ప్రాజెక్టుతో పాటు విడుదల అవుతుండడంతో.. ఎంతమంది ఈ ఆచారిని పట్టించుకుంటారనే సంగతి ఇంకా తేలలేదు.

అయితే.. మూవీ రిలీజ్ అన్నది హీరోయిన్ చేతుల్లో ఉండదు కాబట్టి.. ఇప్పుడు సినిమా విడుదల సందర్భంగా తన వంతు ప్రచారం చేసేస్తోంది ప్రగ్యా జైస్వాల్. అడిగినన్ని కబుర్లు చెబుతూ.. తీసుకున్నన్ని ఫోటోలకు పోజులు ఇస్తూ.. గ్లామర్ ను బాగానే ధారపోస్తోంది. మరి ప్రగ్యా అందాలు.. ప్రచార కష్టాలు.. ఏ మాత్రం నెరవేరతాయో చూడాలి.