Begin typing your search above and press return to search.

చిరు సినిమాలో చేస్తానో లేదో

By:  Tupaki Desk   |   24 April 2018 8:51 AM GMT
చిరు సినిమాలో చేస్తానో లేదో
X
కంచె సినిమాతో ప్ర‌గ్యా జైస్వాల్ తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయ్యింది. అంత‌కు ముందు ఏదో హిందీ సినిమాలో చేసిన‌ప్ప‌టికీ పెద్ద‌గా గుర్తింపు రాలేదు. కంచె హిట్ కొట్ట‌డంతో తెలుగు ద‌ర్శ‌క నిర్మాత క‌ళ్ల‌లో ప‌డింది. కంచె త‌రువాత పెద్ద‌గా ఏ సినిమాతోనూ హిట్ అందుకోలేదు. అడ‌పా ద‌డ‌పా సినిమాలు చేసుకుంటూ పోతోంది. అతి త్వ‌ర‌లో మంచు విష్ణుతో క‌లిసి ఆమె న‌టించిన ఆచారి అమెరికా యాత్ర విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా ప‌లు విష‌యాల గురించి మీడియాతో మాట్లాడుతూ... చిరంజీవి సైరా సినిమాగా గురించి కూడా క‌బుర్లు చెప్పింది.

ఆచారి అమెరికా యాత్ర‌లో కామెడీ ఎలిమెంట్స్ ఎక్కువ‌నీ... మంచు విష్ణు బ్ర‌హ్మానందం మ‌ధ్య సీన్లు తెగ న‌వ్విస్తాయ‌ని చెప్పింది ప్ర‌గ్యా. ఈ సినిమాలో తానూ ఓ ఎన్ఆర్ఐ గా న‌టించాన‌ని అనుకోకుండా ఇండియా వ‌చ్చి హీరో ఆచారితో ప్రేమ‌లో ప‌డే పాత్ర‌ని తెలిపింది. కొన్ని సీన్లలో సాంప్ర‌దాయ‌బ‌ద్ధ‌మైన దుస్తులు ధ‌రించాన‌ని ఆ సీన్లు చాలా బాగా వ‌చ్చాయ‌ని చెప్పింది. ఈ సినిమా డైరెక్ట‌ర్ నాగేశ్వ‌ర్ రెడ్డి గారి ద‌గ్గ‌ర నుంచి చాలా విష‌యాలు నేర్చుకోవ‌చ్చ‌ని చెప్పింది. గ‌తంలో నాగేశ్వ‌ర్ రెడ్డి-మంచు విష్ణు కాంబోలో రెడీ ఈడో ర‌కం ఆడోర‌కం సినిమాలు వ‌చ్చాయ‌ని తెలిపింది. సినిమాలో ట్విస్ట్‌ లు ఉన్నాయ‌ని ప్రేక్ష‌కులు క‌చ్చితంగా థ్రిల్ ఫీల‌వుతార‌ని అంటోంది.

తాను త్వ‌ర‌లో చేయ‌బోయే సినిమాల గురించి కూడా ప్ర‌గ్యా పంచుకుంది. చిరంజీవి సైరా మూవీలో చేసే అవ‌కాశం ఉంద‌ని చెప్పింది. చేస్తానో చేయ‌నో అనే విష‌యం త్వ‌ర‌లో అధికారికంగా ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పింది. సైరాతో మ‌రో రెండు సినిమాలు చ‌ర్చ‌ల ద‌శలో ఉన్నాయ‌ని చెప్పారు. అయితే ఇప్ప‌టికే అన‌ధికారికంగా సైరాలో ప్ర‌గ్యా ఎంపికైన‌ట్టు సినీజ‌నాల్లో టాక్ ఉంది. మ‌రి ప్ర‌గ్యా ఎప్పుడు ప్ర‌క‌టిస్తుందో.