Begin typing your search above and press return to search.

ఎన్నిసార్లు బికినీలు వేస్తావ్ ప్రగ్యా?

By:  Tupaki Desk   |   28 July 2017 6:23 AM GMT
ఎన్నిసార్లు బికినీలు వేస్తావ్ ప్రగ్యా?
X
తెలుగు సినిమాల్లో పెద్ద పెద్ద స్టార్లతో ఛాన్సులు రావడానికి ఒక్కో భామ ఒక్కో రూటు ఎంచుకుంటుంది. అయితే ఎక్కువగా మాత్రం చాలామంది గ్లామర్ రూటులోనే పడతారు. ఏ మాయ చేశావే సినిమాలో సింపుల్ రోల్ చేసిన సమంత.. తరువాత బృందావనం దూకుడు వంటి సినిమాల్లో గ్లామర్ ఓ రేంజిలో ఆరబోసింది. మొన్నటి అ..ఆ లో తప్పించి అన్ని సినిమాల్లోనూ అదే తంతు. అలాగే రకుల్ కూడా తొలి సినిమా నుండి గ్లామర్ తోనే బాణాలేస్తూ ధృవ వంటి సినిమాలో పరేషానురా అంటూ పీక్స్ కు తీసుకెళ్ళింది. వీళ్ళ బాటలోనే ఇప్పుడు ఇతర హీరోయిన్లు కూడా ప్రయత్నిస్తున్నారు.

ముఖ్యంగా 'కంచె' సినిమాతో లైమ్ లైట్లోకి వచ్చేసి.. తరువాత పెద్దగా బ్రేక్ తెచ్చుకోలేకపోతున్న ప్రగ్యా జైస్వాల్ అయితే.. ఇప్పుడు తాను అందాల పోటీల్లో కంటెస్టుంటుగా ఉన్నప్పుడు ఎలాగైతే బికినీలతో విరుచుకుపడేదో.. సేమ అలాగే రెచ్చిపోతోంది. మొదటిగా అమ్మడు 'నక్షత్రం' సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన చేసిన ఓ పాటలో బికినీ వేసుకుని షాకిచ్చింది. టూ పీస్ అందాలను ఒక తెల్లటి షర్టుతో కవర్ చేస్తూ.. చూపరులను ఉడికించేసింది అంతే. అది చాలదన్నట్లు ఇప్పుడు మరోసారి బికినీ స్టంట్ మరో సినిమాలో కూడా వేస్తోందట.

'జయ జానకి నాయక' సినిమాలో ఇప్పటివరకు కేవలం రకుల్ ప్రీత్ పాత్రను మాత్రమే చూపించాడు బోయపాటి శ్రీను. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా కనిపించనున్న ప్రగ్యా జైస్వాల్.. ఒక సీన్లో ఈత కొలనులో బికినీలో సందడి చేయనుందట. అక్కడ కూడా టూ పీస్ డ్రస్సే వేసిందట. పైగా చాలా రోజులు జిమ్ చేసి తన పొత్తికడుపు దగ్గర ఫ్యాట్ కనపడకుండా చూసుకుంటూ ఈ బికినీ సీన్ చేసిందట ప్రగ్యా. మరి తనకు బ్రేక్ వచ్చేవరకు ఎన్నిసార్లు ఇలా బికినీలు వేస్తుందో ఏంటో!!