ఫోటో స్టొరీ: బికినీ అందాలు.. సూర్య కిరణాలు

Thu May 23 2019 07:00:02 GMT+0530 (IST)

ప్రగ్య జైస్వాల్ పేరు వినగానే ఎవరికైనా వెంటనే వరుణ్ తేజ్ 'కంచె' సినిమా గుర్తొస్తుంది.  ఆ సినిమాలో సీత పాత్రలో ప్రగ్య తన నటనతో.. లుక్స్ తో అందరినీ మెప్పించింది.  ఆ సినిమా ప్రగ్యకు మంచి బ్రేకే కానీ ఆ తర్వాత ప్రగ్య నటించిన సినిమాలేవీ విజయం సాధించలేదు. దీంతో కెరీర్ లో స్లో అయిపోయింది.  ప్రగ్య లాస్ట్ సినిమా 'ఆచారి అమెరికా యాత్ర' తర్వాత ఇప్పటివరకూ ప్రగ్యకు చెప్పుకోదగ్గ ఆఫర్లు రాలేదు.ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'సైరా' లో నటిస్తోంది కానీ ఆ క్యారెక్టర్ కు స్క్రీన్ టైమ్ ఎంత ఉందో.. ప్రగ్య కెరీర్ కు ఎంతమేరకు ఉపయోగపడుతుందో సినిమా విడుదలైతేగానీ తెలియదు. సినిమాల సంగతి పక్కన పెట్టేస్తే ప్రగ్య సోషల్ మీడియాలో చెలరేగిపోతోంది. తాజాగా ప్రగ్య ఒక ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.  ఫోటోకు ప్రత్యేకంగా క్యాప్షన్ ఇవ్వలేదు.. బీచ్ లో సూర్యుడు అన్నట్టుగా రెండు ఎమోజీలనుమాత్రం క్యాప్షన్ గా ఇచ్చింది. సముద్రపు ఒడ్డున డార్క్ కలర్ బికినీలో వయ్యారంగా కూర్చుని సూర్యుని కిరణాలు తనపై పడుతుంటే ఒక పెయింటింగ్ లా పోజిచ్చింది. ఆ బికినీని డిజైన్ చేసిన ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ ఎవరో గానీ కళాత్మకత చూపించాడు. సిల్వర్ కలర్ స్ట్రాప్ లు.. అంచులతో బికినీని మెరిసేలా చేశాడు.

ఒక చేతిని అలా పైకెత్తి.. మరో చేతిని భుజంపై పెట్టుకొని ప్రకృతి రమణీయతను పూర్తిగా ఆస్వాదిస్తున్న అరేబియా సముద్రపు సుందరిలా పోజిచ్చింది.  నెటిజనులకు ఈ పోజు తెగ కనెక్ట్ అయింది. ఒకరు "ప్రగ్యా జీ ఆప్ కా హాట్ స్టిల్ కిల్లింగ్ జీ" అన్నారు. మరొకరు "హాట్ బ్యూటీ ఇన్ కూల్ సీనరీ" అన్నారు.  ఇంకొకరు "సిలౌట్ సుందరి" అని కాంప్లిమెంట్ ఇచ్చారు.  మరొకరు  "కిల్లర్ పోజ్.. సూపర్ ఫోటోగ్రఫీ" అన్నారు.