Begin typing your search above and press return to search.

ఇప్పుడైనా ప్రగ్యాకు హిట్టిస్తారా?

By:  Tupaki Desk   |   20 Jan 2018 7:56 PM GMT
ఇప్పుడైనా ప్రగ్యాకు హిట్టిస్తారా?
X
కంచె సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్ మొదట్లో ఎలా కనిపించిందో అందరికి తెలిసిందే. సీతాదేవి పాత్రలో నిండు చీర కట్టుతో ఆమె చూపించిన హావభావాలను కుర్రకారు అంత ఈజీగా మరచిపోలేరు. అందానికి అసూయా కలిగేలా ఉండే ఈ బ్యూటీ నవ్వుకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అయితే ప్రగ్యా కంచె సినిమా వరకే కొంచెం పద్దతిగా కనిపించింది. గ్లామర్ పాత్రలు ఈ బ్యూటీ చేయదు అనుకున్నారేమో అని ప్రగ్యా వెంటనే మారిపోయింది.

లిమిట్స్ లో ఉండే గ్లామర్ కంచెను దాటేసి డోస్ పెంచేసింది. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఉన్న ఏ హీరోయిన్స్ కూడా ఇవ్వని షాక్ తరువాత సినిమాలతో ఇచ్చేసింది. గుంటూరోడు - నక్షత్రం సినిమాలో హాట్ గా కనిపించింది. అలాగే జయజనకి నాయక సినిమాలో కూడా తన ఘాటు అందాలతో బాగానే ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఆచారి అమెరికా యాత్ర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జీ.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన ఆ సినిమా జనవరి 26న రిలీజ్ కానుంది. రీసెంట్ గా ప్రీ రిలీజ్ వేడుకను జరిపారు.

అయితే ఈ సినిమాతో అయినా ప్రగ్యా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటోంది. అందుకోసం చాలా కష్టపడింది. ఆ మధ్యలో షూటింగ్ చేస్తుండగా రిస్క్ సిన్ చేసి గాయపడింది కూడా. ట్రైలర్ లోనే తన అందాల టిఫిన్ వడ్డించేసింది. ఇక సినిమాలో ఫుల్ మిల్స్ తప్పకుండా ఉంటాయని చెప్పకనే చెప్పింది. ఈ సినిమాలో విష్ణుతో కెమిస్ట్రీ బాగా సెట్ అయినట్లు తెలుస్తోంది. మరి ఆచారి అమ్మడికి హిట్ ఇస్తాడో లేదో చూడాలి.