Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: మైక్రో నిక్కర్లో మెస్మరైజ్ చేస్తోందే

By:  Tupaki Desk   |   14 Feb 2019 4:18 AM GMT
ఫోటో స్టొరీ: మైక్రో నిక్కర్లో మెస్మరైజ్ చేస్తోందే
X
ప్రగ్య జైస్వాల్ పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకెవరికైనా వెంటనే క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'కంచె' సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమాలో సీత పాత్ర పోషించిన ప్రగ్య తన లుక్స్ తో.. డీసెంట్ పెర్ఫార్మన్స్ తో అందరినీ మెప్పించింది. కానీ ఆ తర్వాత ప్రగ్య నటించిన రెండు మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడడంతో అమ్మడి కెరీర్ డెడ్ స్లో అయింది.

'ఆచారి అమెరికా యాత్ర' తర్వాత ఇప్పటివరకూ ప్రగ్యకు చెప్పుకోదగ్గ ఆఫర్లు రాలేదు. మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'సైరా' లో ఒక కీలక పాత్రలో నటిస్తోంది కానీ ఆ క్యారెక్టర్ ప్రగ్య కెరీర్ కు ఎంతమేరకు ఉపయోగపడుతుందో సినిమా విడుదలైతేగానీ తెలియదు. కానీ ఈ విషయాలను పక్కనబెట్టేసి తనదైన శైలిలో సోషల్ మీడియాలో చెలరేగిపోతోంది. ఈ జెనరేషన్ బ్యూటీల స్టైల్లోనే ప్రగ్య కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా హాటు ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుందని మీకు తెలుసో లేదో గానీ ఆమెను క్లోజ్ గా ఫాలో అయ్యే నెటిజనులకు మాత్రం చక్కగా తెలుసు.

ఆ ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ తాజాగా ప్రగ్య ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ రెండు బ్లాస్టింగ్ ఏమోజిలు. అంతే. అంటే వాటి అర్థం హ్యావ్ అ బ్లాస్ట్ అనేమో. ఫోటోలో స్లీవ్ లెస్ ఎల్లో టీ - షర్ట్.. ఒక జీన్స్ షార్ట్ వేసుకుంది. దాన్ని షార్ట్ అనడం అస్సలు బాగోదు కానీ.. షార్టెస్ట్ అనడం కరెక్ట్. మైక్రో నిక్కర్ లా ఉంది. ఓవరాల్ గా డ్రెస్ అల్ట్రా స్టైలిష్ గా ఉంది కానీ అందాల విందు మాత్రం చేయలేదు. అయినా నెటిజనులు ఫుల్ గా మెస్మరైజ్ అయ్యారు. క్యూట్ అని ఒకరు.. హాట్ అని మరొకరు.. ఇలా తోచిన కామెంట్స్ చేస్తూ లైకుల మీద లైకులు కొట్టారు. వాళ్ళకు డ్రెస్ కంటే కూడా ప్రగ్య ఇచ్చిన సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ పిచ్చపిచ్చగా నచ్చిందేమో!