Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ప్ర‌గ్యలో జ్వ‌ల‌నం

By:  Tupaki Desk   |   28 Nov 2018 6:51 AM GMT
ఫోటో స్టోరి: ప్ర‌గ్యలో జ్వ‌ల‌నం
X
`కంచె` చిత్రంతో టాలీవుడ్‌ లో అడుగుపెట్టింది ప్ర‌గ్య జైస్వాల్. న‌టించిన తొలి సినిమాతోనే కుర్ర‌కారు హృద‌యాల్ని ట‌చ్ చేసింది. ఆ చిత్రంలో ఎంతో సంప్ర‌దాయ బ‌ద్ధంగా క‌నిపించిన ఈ ముంబై బ్యూటీ - ఆ త‌ర్వాత త‌న‌లోని గ్లామ‌ర్ కోణాన్ని ఆవిష్క‌రించింది. ముంబై డాళ్స్‌ లో వేడెక్కించే కంటెంట్‌ కి ఏమాత్రం కొద‌వ లేద‌ని ఈ భామ మ‌రోసారి ప్రాక్టిక‌ల్‌ గా చూపించే ప్ర‌య‌త్నం చేసింది. మిర్చి లాంటి కుర్రాడు - ఓం న‌మో వెంక‌టేశాయ‌ - గుంటూరోడు - న‌క్ష‌త్రం - జ‌య జాన‌కి నాయ‌క చిత్ర‌ల్లోనూ ప్ర‌గ్య క‌థానాయిక‌గా న‌టించింది. ఈ అమ్మ‌డు న‌టించిన చివ‌రి తెలుగు చిత్రం ఆచారి అమెరికా యాత్ర‌. వీటిలో మెజారిటీ పార్ట్ ఫ్లాపులు కెరీర్ ప‌రంగా డైలెమ్మాలో ప‌డేశాయి.

అయినా ప్ర‌గ్య టాలీవుడ్‌ లోని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుని అండ‌తో ఇంకా త‌న ఉనికిని చాటుకునే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంది. సైమా అవార్డు వేడుక‌లు స‌హా ప‌లు ఈవెంట్ల‌లో ఈ అమ్మ‌డు త‌న ట్యాలెంట్‌ ని ప్ర‌ద‌ర్శించే అవ‌కాశం అందుకుంది. ప్ర‌స్తుతం `సైరా - న‌ర‌సింహారెడ్డి` చిత్రంలో ఓ అతిధి పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికీ సౌత్‌ లో ఈ బ్యూటీ అవ‌కాశాల వేట సాగిస్తూనే ఉంది. ఈ వేట‌లో భాగంగానే సామాజిక మాధ్య‌మాల్లోనూ త‌న‌లోని వేడెక్కించే కంటెంట్‌ ని ఎలివేట్ చేస్తోంది.

ఇటీవ‌ల హాట్ గాళ్స్ అంతా ఇన్న‌ర్‌ వేర్ - జిమ్ వేర్ ధ‌రించి సామాజిక మాధ్య‌మాల్లో వాడి వేడి చ‌ర్చ‌కు తావిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌గ్య అదే పంథాని అనుస‌రించింది. తాజాగా రివీల్ చేసిన లోదుస్తుల గెట‌ప్ ఫ్యాన్స్‌ లో జోరుగా వైర‌ల్ అవుతోంది. దిశా ప‌టానీ సీకే బ్రాండ్‌ తో ఎలా దూసుకెళ్లిందో ఇప్పుడు ప్ర‌గ్య కొత్త గెట‌ప్‌ అంతే వేగంగా దూసుకెళుతోంది. స్వ‌త‌హాగానే ప్ర‌గ్య ఫిట్‌ నెస్ ఫ్రీక్‌. దీంతో టైట్ ఫిట్‌ జిమ్ వేర్‌ లో వేడి పుట్టిస్తోంది.