Begin typing your search above and press return to search.

మంచు విష్ణు అంత మాటనేశాడేంటి..?

By:  Tupaki Desk   |   23 July 2017 6:58 AM GMT
మంచు విష్ణు అంత మాటనేశాడేంటి..?
X
మంచు విష్ణు తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసిన వీడియో ఒకటి చర్చనీయాంశం అవుతోంది. తన కొత్త సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’లో తనకు జోడీగా నటిస్తున్న ప్రగ్యా జైశ్వాల్ షూటింగ్ గ్యాప్‌ లో సేదదీరుతున్నపుడు తీసిన వీడియో అది. ఆ వీడియోలో ఛైర్ మీద కూర్చుని మెడకు ఐస్ పెట్టుకుంటోంది ప్రగ్యా. ఆమెను ఉద్దేశించి మంచు విష్ణు ఇంగ్లిష్ లో కొన్ని ప్రశ్నలడిగాడు.

ఏమైంది నీ మెడకు అని అడిగితే.. కార్లో పడుకున్నపుడు తన మెడ పట్టేసిందని ఆమె సమాధానం ఇచ్చింది. ఐతే.. ‘వైల్ స్లీపింగ్ విత్...’ అంటూ క్వశ్చన్ మార్క్ వేసి ఆగిపోయాడు విష్ణు. దానికామె చిరాగ్గా.. ‘ఇన్ ద కార్’ అంటూ సమాధానం ఇచ్చింది. ఈ వీడియోతో పాటు ప్రగ్యా జవాబు తాను నమ్మగలనో లేదో అంటూ వ్యాఖ్య కూడా జోడించాడు విష్ణు. అతడి ఉద్దేశం ఏంటో ఏమో కానీ.. ఈ వీడియో మాత్రం జనాలకు వేరే అభిప్రాయాలు కలిగిస్తోంది. మంచు విష్ణు అతి చేశాడన్న ఫీలింగ్ కలిగిస్తోంది.

ఇంతకుముందు ‘గుంటూరోడు’లో తమ్ముడు మంచు మనోజ్‌ తో జత కట్టిన ప్రగ్యా.. ఇప్పుడు అన్నయ్య మంచు విష్ణు సరసన నటిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో ‘లక్కున్నోడు’తో కంగుతిన్న మంచు విష్ణు.. తన లక్కీ డైరెక్టర్ నాగేశ్వరరెడ్డితో చేస్తున్న ‘ఆచారి అమెరికా యాత్ర’పై చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ చిత్రంలో బ్రహ్మానందం ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. సీనియర్ నిర్మాత ఎం.ఎల్.కుమార్ చౌదరి చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఈ సినిమాతో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ మలేషియాలో జరుగుతోంది.