ఐదేళ్ల క్రితం బికినీ మంటలు

Sun Jan 20 2019 12:32:38 GMT+0530 (IST)

`కంచె` బ్యూటీ ప్రగ్య జైశ్వాల్ స్పీడ్ గురించి తెలిసిందే. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు టచ్ లో ఉంటోంది. రెగ్యులర్ గా హాట్ ఫోటోల్ని అప్లోడ్ చేస్తూ ప్రగ్య స్పెషల్ ట్రీట్ ఇస్తోంది. గ్లామర్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రగ్య చేయని ప్రయత్నం లేదు. రెగ్యులర్ ఫిట్ నెస్ కోసం నిరంతరం జిమ్ముల్లో కసరత్తులు చేస్తూ వేడెక్కించే వీడియోల్ని షేర్ చేస్తోంది. కెల్విన్ క్లెయిన్ ప్రచారం పీక్స్ లో ఉన్నప్పుడు లోదుస్తులతో ఫోటోషూట్ ని అభిమానులకు షేర్ చేసింది.లేటెస్టుగా ప్రగ్య `10 ఇయర్స్ ఛాలెంజ్` ని స్వీకరించి ఓ ఫోటోని ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేసింది. 2014లో ఓ ఫోటోషూట్ నుంచి ఎంపిక చేసిన ఫోటో ఇది. మొబైల్ ఫోన్ గ్యాలరీల్లో వెతుకుతుండగా దొరికింది.. అంటూ ప్రగ్య తెలిపింది. ప్రఖ్యాత స్టిల్ ఫోటోగ్రాఫర్ మున్నా ఈ ఫోటోషూట్ చేశారని ప్రతాప్ సిమన్ స్టైలింగ్ చేశారని నాటి రోజుల్ని తలచుకుంది. ఐదేళ్ల నాటి మోడలింగ్ డేస్ ని ప్రగ్య గుర్తుకు తెచ్చుకుంది.

కెరీర్ పరంగా ఈ భామను పరిశీలిస్తే... సినీపరిశ్రమలో ప్రవేశించిన ఐదేళ్లలో కేవలం ఏడెనిమిది సినిమాల్లో మాత్రమే ప్రగ్య జైశ్వాల్ నటించింది. వరుణ్ తేజ్ సరసన `కంచె` చిత్రంతో తెరకు పరిచయమై అటుపై మిర్చి లాంటి కుర్రాడు ఓం నమో వెంకటేశాయ గుంటూరోడు నక్షత్రం జయ జానకి నాయక చిత్రల్లో నాయికగా నటించింది. చివరిగా మంచు విష్ణు సరసన `ఆచారి అమెరికా యాత్ర` చిత్రంలో నటించింది. ప్రస్తుతం `సైరా - నరసింహారెడ్డి` చిత్రంలో ఓ అతిధి పాత్రలో నటిస్తోందన్న సమాచారం ఉంది.