పెద్దలకు మాత్రమే... ఇవేం పెళ్లి చూపులు?

Thu Oct 11 2018 11:42:11 GMT+0530 (IST)

తెలుగు బుల్లి తెర ప్రేక్షకుల్లో ప్రదీప్ అంటే అభిమానం మరియు గౌరవం ఉంటుంది. ఇతర మేల్ యాంకర్స్ మాదిరిగా చిల్లర వేశాలు వేయకుండా పద్దతిగా ఏ కార్యక్రమంను అయిన హోస్ట్ చేస్తాడు. అందుకే ప్రదీప్ అంటే ముఖ్యంగా అమ్మాయిలకు విపరీతమైన అభిమానమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. హీరోల కంటే ఎక్కువగా ప్రదీప్ కు లేడీస్ లో ఫాలోయింగ్ ఉందనే టాక్ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అంతటి క్రేజ్ ఉన్న ప్రదీప్ ప్రస్తుతం తాను చేస్తున్న పెళ్లి చూపులు షో కారణంగా పోగొట్టుకుంటున్నాడనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.బిగ్ బాస్ సీజన్ 2 పూర్తి అవ్వగానే ప్రదీప్ పెళ్లి చూపులు కార్యక్రమం ప్రారంభం అయిన విషయం తెల్సిందే. షో ప్రారంభంకు ముందు రెండు నెలలు తెగ పబ్లిసిటీ చేసిన కారణంగా భారీ ఎత్తున అమ్మాయిలు ఆడిషన్స్ కు హాజరు అయ్యారు. ఆడిషన్స్ లో 14 మంది అమ్మాయిలను ఎంపిక చేశారు. వారిలోంచి ప్రదీప్ ఒకరిని ఎంపిక చేసుకుని వివాహం చేసుకుంటారు అంటూ ప్రకటించిన విషయం తెల్సిందే. పెళ్లి విషయం ఏమో కాని ఆ 14 మంది అమ్మాయిలతో షో నిర్వాహకులు ఒక ఆట ఆడేసుకుంటున్నారు. వారి మనోభావాలు దెబ్బ తినేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా ప్రదీప్ అమ్మాయిల బాడీ పార్ట్ లను గుర్తించే టాస్క్ నడిచింది. ఆ టాస్క్ లో ఎవరి బాడీ పార్ట్స్ ను ప్రదీప్ గుర్తు పడితే వారిపై ప్రదీప్ కు ఎక్కువ ప్రేమ ఉన్నట్లు అన్నమాట.

తాజాగా అమ్మాయిల పెదాలను క్లోజప్ గా చూపించి ఎవరివో గుర్తు పట్టమని ప్రదీప్ కు చెప్పారు. అమ్మాయిల బాడీ పార్ట్స్ మరియు లిప్స్ - కళ్లు చూపించి ఈ షో పెద్దలకు మాత్రమే అన్నట్లుగా సాగిస్తున్నారు. మెల్ల మెల్లగా ఆసక్తిని కల్పించేందుకు అమ్మాయిల మద్య విభేదాలు కూడా మొదలు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి ఇవేం పెళ్లి చూపులు ప్రదీప్ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. మరి కొందరు వెంటనే ఈ పెళ్లి చూపులు ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముందు ముందు పెళ్లి చూపులులో ఎలాంటి సీన్స్ చూడాల్సి వస్తుందో అంటూ ఒక వర్గం ప్రేక్షకులు ఆందోళనగా ఉన్నారు.