Begin typing your search above and press return to search.

స్వరాలు సమకూర్చడమే మిగులుంది

By:  Tupaki Desk   |   3 Aug 2015 10:21 AM GMT
స్వరాలు సమకూర్చడమే మిగులుంది
X
సినిమా అనగానే సాధారణ ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది హీరో హీరోయిన్లే. తెరపైన కనపడేది వారే కాబట్టి. ఆ తర్వాత దర్శకుడు. కానీ వీరందరికంటే ముందుండి నడిపించేది నిర్మాత. ప్రేక్షకులతో వీరికి ఎక్కువగా పరిచయం లేకపోయినా సినీ జనాలకు కావాల్సింది వీళ్ళే. ఈ నిర్మాణరంగంలోకి ఓ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు అడుగుపెట్టారు. అతనెవరో ఈపాటికే మీకు తెలిసిపోయుంటుంది. కరెక్ట్.. అది ప్రభుదేవానే.

1989లో వేట్రి వేజా అనే తెలుగు సినిమాతో కొరియోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించారు ప్రభుదేవా. అదే ఏడాది వచ్చిన చిరంజీవి లంకేశ్వరుడు సినిమాతో తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చారు మన ఇండియన్ మైకేల్ జాక్సన్. తెలుగు తమిళ భాషల్లో కొరియోగ్రాఫర్ గా బిజీ గా ఉంటూనే నటుడిగానూ వెలుగొందారు. అటుపై మెగాఫోన్ పట్టి దక్షిణాదిన పలు సినిమాలు చేసి బాలీవుడ్ లోనూ విజయవంతంగా కెప్టెన్ భాద్యతను నిర్వర్తించి మళ్ళీ సౌత్ వైపు వచ్చి ప్రభుదేవా స్టూడియోస్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రాంభించారు.

ఈ బ్యానర్ లో అయిదు సినిమాలు ఇదే ఏడాది నిర్మిస్తారట. నేడు చెన్నైలో బ్యానర్ ఆఫీసు ఓపెనింగ్ జరిగింది. ప్రకాష్ రాజ్, జయం రవి తదితరులు హాజరై కొత్త నిర్మాతకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటివరకూ సినిమాలో కీలకమైన నటుడు, దర్శకుడు, కొరియోగ్రఫీ చేసిన ప్రభుదేవా నిర్మాతగానే చేయలేదని అనుకున్నారు. నేటితో దానికి శుభం కార్డు పడిపోయింది. భవిష్యత్తులో లారెన్స్ లా సంగీత దర్శకత్వం చేస్తారేమో..!