Begin typing your search above and press return to search.

ప్ర‌భుదేవాకు అంత క్రేజా?

By:  Tupaki Desk   |   27 Aug 2016 1:30 AM GMT
ప్ర‌భుదేవాకు అంత క్రేజా?
X
సౌత్ ఇండియా.. నార్త్ ఇండియా అని తేడా లేదు. ప్ర‌భుదేవాకు దేశవ్యాప్తంగా మంచి క్రేజే ఉంది. ఇండియాలో బెస్ట్ డ్యాన్స‌ర్‌.. డ్యాన్స్ మాస్ట‌ర్ ఎవ‌రంటే.. ముంబ‌యి వాళ్లు కూడా ప్ర‌భుదేవా పేరే చెబుతారు. అత‌ణ్ని ఇండియ‌న్ మైకేల్ జాక్స‌న్ అని సంబోధిస్తారు. ద‌ర్శ‌కుడిగా మారాక అత‌డి రేంజి మ‌రింత పెరిగింది. ప్ర‌స్తుతం ప్ర‌భుదేవా అంటే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ వాల్యూ ప్ర‌భుదేవా కూడా బాగానే ఉప‌యోగించుకుంటున్నాడు. ప్ర‌భుదేవా పేరిట తాజాగా ఒక యాప్ రావ‌డం విశేషం. ప్ర‌భుదేవా.కామ్ వెబ్ సైట్ నుంచి అత‌డి అభిమానులు ఆ యాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే ప్ర‌భుదేవాకు సంబంధించి చిన్న‌ప్ప‌ట్నుంచి అరుదైన ఫొటోలు డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు. అత‌డి సినిమాల పాట‌ల్ని ఎక్స్ క్లూజివ్ గా వినొచ్చు. ప్ర‌భుదేవా చేయ‌బోయే సినిమాల అప్ డేట్స్ తెలుసుకోవ‌చ్చు. అత‌డి డ్యాన్స్ రిహార్స‌ల్స్ తో పాటు కొన్ని ప్ర‌త్యేక‌మైన వీడియోలు కూడా అందుబాటులో ఉంచుతాడ‌ట‌. ప్ర‌భుదేవా కెరీర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ యాప్ ద్వారా తెలుసుకోవ‌చ్చ‌ట‌. ఈ యాప్ అందుబాటులోకి రాగానే అభిమానుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోందని సంతోషం వ్య‌క్తం చేశాడు ప్ర‌భుదేవా. యాప్ తీసుకురావ‌డం పెద్ద విష‌యం కాదు కానీ.. దానికి అభిమానుల రెస్పాన్స్ ఎలా ఉంటుంద‌న్న‌ది ముఖ్యం. ఈ విష‌యంలో ప్ర‌భుదేవాకు ఢోకా ఏమీ లేదు. డౌన్ లోడ్స్ య‌మ జోరుగానే సాగుతున్నాయ‌ట‌.