బర్త్ డే కు ప్రభాస్ స్పెషల్ పార్టీ

Sun Oct 22 2017 19:20:14 GMT+0530 (IST)


సాధారణంగా కొంతమంది సినీ హీరోలు - సెలబ్రిటీలు తమ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఆడంబరంగా జరుపుకునే ఆ వేడుకలకు మిత్రులు - సన్నిహితులు - అభిమానులను ఆహ్వానిస్తుంటారు. అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటాడు. తన బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడం ప్రభాస్ కు పెద్దగా ఇష్టం ఉండదు. పార్టీ కల్చర్ కు ప్రభాస్ దూరంగా ఉంటాడు.అయితే అందుకు భిన్నంగా ప్రభాస్ రేపు తన పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ రాత్రి గ్రాండ్ పార్టీ ఇవ్వబోతున్నాడట. టాలీవుడ్ గ్రీకు దేవుడు - 'బాహుబలి' ప్రభాస్ రేపు 38వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా స్నేహితులకు పార్టీ ఇస్తున్నాడట.

'బాహుబలి-2' తర్వాత ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్ డే కావడంతో తన క్లోజ్ ఫ్రెండ్స్ - ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖుల మధ్య ఈ పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవాలని ప్రభాస్ ఫిక్స్ అయ్యాడట. అందులోనూ బాహుబలి సక్సెస్ తర్వాత బర్త్ డేకు  గ్రాండ్ పార్టీ ఇవ్వమని అతడి ఫ్రెండ్స్ పట్టుపట్టారట. దీంతో ఈ రోజు రాత్రి  బర్త్ డే పార్టీకి ఏర్పాట్లు  పూర్తయినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ తర్వాత ఈ రోజే మీడియా మిత్రుల కోసం ప్రభాస్ ఓ ప్రత్యేక పార్టీ ఇవ్వబోతున్నాడట. తన పుట్టిన రోజునాడు మీడియా మిత్రులకు పార్టీ ఇచ్చే అలవాటు ప్రభాస్ కు ఎప్పటి నుంచో వుంది. అదే తరహాలో ఈసారి కూడా మీడియాకు పెద్ద పార్టీ ఏర్పాటు చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ రెండు పార్టీలక కోసం భీమవరం స్టైల్లో ప్రత్యేక వంటకాలు సిద్ధమయినట్లు తెలుస్తోంది. అందులోనూ ప్రభాస్ కు ఇష్టమైన చేపల వంటకాలు ఈ పార్టీలో స్పెషల్ ఎట్రాక్షన్ అట. ప్రస్తుతం సాహో షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ వచ్చే నెలలో దుబాయ్ వెళ్లనున్నాడు. అక్కడ సాహో కోసం కీలకమైన యాక్షన్ సన్నివేశాలలో పాల్గొనబోతున్నాడు.