Begin typing your search above and press return to search.

ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ?

By:  Tupaki Desk   |   25 Oct 2016 5:31 AM GMT
ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ?
X
బాహుబలి సినిమా పూర్తయిపోవాలని ప్రభాస్ అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. బాహుబలిగా ప్రభాస్ వీరోచిత రూపాన్ని చూసే ఛాన్స్ ఒక కారణం అయితే.. ఎంత త్వరగా ఈ సినిమా షూటింగ్ అయిపోతే.. అంత త్వరగా ప్రభాస్ మరో సినిమా మొదలుపెడతాడన్నది మరో రీజన్. ఇప్పటికే ప్రభాస్ నెక్ట్స్ పిక్చర్ పై క్లారిటీ ఉంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సుజిత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.

డిసెంబర్ చివర్లో ప్రభాస్-సుజిత్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు సన్నహాలు జరుగుతున్నాయి. ఇందుకు మరో నెల రోజులు మాత్రమే గ్యాప్ ఉండడంతో.. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు వేగం పుంజుకున్నాయి. ఈ మూవీలో ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ భామ పరిణీతి చోప్రాను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె దగ్గరకు ప్రపోజల్ కూడా పంపారట. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందనున్న ఈ చిత్రంపై పరిణీతి కూడా ఆసక్తిగా ఉందని తెలుస్తోంది.

ఈ సబ్జెక్ట్ పై 150కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారని.. ఈ మొత్తాన్ని రాబట్టుకునేందుకు తెలుగుతోపాటు హిందీ-తమిళ్ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. హిందీ వెర్షన్ కు క్రేజ్ పెంచడం కోసమే బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోవాలని అనుకుంటున్నాడట దర్శకుడు సుజిత్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/