పబ్బులో చిక్కిన ప్రభాస్?

Thu May 23 2019 14:35:12 GMT+0530 (IST)

డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం `సాహో` చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఎట్టి పరిస్థితిలో ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా రిలీజ్ చేస్తున్నామని యువి క్రియేషన్స్ సంస్థ ప్రకటించింది. అందుకు సంబంధించిన కొత్త పోస్టర్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ రికార్డ్ వ్యూస్ తో వెబ్ లో దూసుకుపోతోంది. అయితే చెప్పిన తేదీ ప్రకారం ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలంటే ఇంకా పెండింగ్ పని ఎంత ఉంది? అన్నది తెలియాల్సి ఉంది.ఓవైపు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ సెట్ వేసి ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ని చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదో కలర్ ఫుల్ రిచ్ పబ్ సెట్ అని తెలుస్తోంది. ఇందులో ఐదు రోజుల పాటు సాంగ్ షూట్ జరగనుంది. ప్రభాస్ ఈ పాటలో అదిరిపోయే స్టెప్పులతో ఉర్రూతలూగిస్తాడట. శ్రద్ధా కపూర్ తనతో పాటు స్టెప్పు కలుపుతుందా లేదా అన్నది చిత్ర యూనిట్ రివీల్ చేయాల్సి ఉంది.

డార్లింగ్ ప్రభాస్ ఓ పూర్తి పాటకు హుషారెత్తించే అద్భుతమైన డ్యాన్సులు చేసి చాలా కాలమే అయ్యింది. అప్పుడెప్పుడో రెబల్- మిర్చి టైమ్ లో ఓ రేంజులో స్టెప్పులతో అదరగొట్టాడు. మధ్యలో బాహుబలి సిరీస్ లో డ్యాన్సులకు స్కోప్ లేదు కాబట్టి `ఏ వచ్చి బీపై వాలే` అంటూ డ్యాన్సులు చేసేందుకు వీలు లేకుండా పోయింది. అందుకే కసి తీరా ఈ పబ్ సాంగ్ లో డ్యాన్సులు చేసేందుకు ప్రభాస్ కాస్తంత ముందస్తు ప్రిపరేషన్ సాగిస్తున్నాడట. బాహుబలి చిత్రంలో `మనోహరి..` సాంగ్ లో ముగ్గురు భామలతో ప్రభాస్ రొమాంటిక్ డ్యాన్స్ మూవ్స్ ని అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. అంతకుమించి సాహో కోసం పబ్ సాంగ్ ని స్పైసీగా తీర్చిదిద్దనున్నారని తెలుస్తోంది. `సాహో` చిత్రంలో ప్రభాస్ గజదొంగగా నటిస్తున్నారా?  లేక సీక్రెట్ కాప్ తరహా పాత్రలో నటిస్తున్నారా? అన్నది రివీల్ కావాల్సి ఉంది.