Begin typing your search above and press return to search.

సాహో ట్రైలర్ టాక్ వచ్చేసిందా?

By:  Tupaki Desk   |   9 Dec 2018 10:55 AM GMT
సాహో ట్రైలర్ టాక్ వచ్చేసిందా?
X
ప్రభాస్ సాహో మేకింగ్ షేడ్స్ పేరుతో వీడియో రూపంలో విడుదలయ్యాక అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. ఎడిటింగ్ చేయని షాట్స్ లో ఒక్క సీన్ లోనే ప్రభాస్ కనిపించినా దానికే అభిమానులు ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇటీవల రఫ్ ట్రైలర్ ఒకటి కట్ చేశారట. ప్రమోషన్ కోసం ఉద్దేశించిన ఈ వీడియోని బాగా దగ్గరివాళ్లకు మాత్రమే చూపించి వాళ్ళ రెస్పాన్స్ ను బట్టి మార్పులు చేయాలనీ ఆలోచించారట. అందులో భాగంగానే అలా రఫ్ గా ఎడిట్ చేసిన ట్రైలర్ ని ఓ సీనియర్ నిర్మాతకు ప్రివ్యూ వేశారు. అందులో సీజే వర్క్ కూడా లేదు. ఆన్ లొకేషన్ లో తీసిన రషెస్ ని తీసుకునే ఆ ఫుటేజ్ సహాయంతో ఇది చేయించారు.

దీనికే సదరు నిర్మాత ఫ్యూజులు పోయాయట. అసలు ప్రభాస్ ని ఇందులో ఇంత మ్యాన్లీగా ఎలా చూపించారని పొగుడుతూ మేకింగ్ చూస్తుంటే ఏదో జేమ్స్ బాండ్ హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టు ఫీలింగ్ కలిగిందని చెప్పారట. దీంతో సాహో టీమ్ ఆనందం మాములుగా లేదని సమాచారం. కన్ ఫర్మ్ చేసుకోవడానికి ఇంకో ఇద్దరు బయటి వాళ్లకు చూపిస్తే అంతకు మించిన రెస్పాన్స్ వచ్చిందని వినికిడి. మరి ఈ రష్ తో కట్ చేసిన ట్రైలర్ కి ఫైనల్ గా డీఐ సీజే వర్క్ కంప్లీట్ చేసి దానికి బీజీఎమ్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి మాటలు చాలటం లేదట.

ఇదంతా అతిశయోక్తిగా అనిపించినా సాహో టీమ్ పడిన కష్టానికి దర్శకుడు సుజిత్ ఐదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తగ్గట్టే ఉంటుందని అంటున్నారు. విడుదల విషయంలో సాహో టీమ్ కు ఇంకా క్లారిటీ లేదు. ఇంకో రెండు మూడు నెలలు తర్వాత ఓ నిర్ణయానికి రావొచ్చు.