Begin typing your search above and press return to search.

ప్రభాస్ తప్పేంటో తెలియట్లేదే!!

By:  Tupaki Desk   |   23 March 2018 4:22 AM GMT
ప్రభాస్ తప్పేంటో తెలియట్లేదే!!
X
ప్రభాస్ క్రేజ్ గురించి ఇప్పుడు చెప్పాలంటే.. బాహుబలికి ముందు ఒక లెక్క.. బాహుబలి2 తర్వాత మరో లెక్క.. అనే విషయం ఒప్పుకోవాలి. తనకు వచ్చిన గుర్తింపును బేస్ చేసుకుని తన తర్వాతి చిత్రాలను ప్లాన్ చేసుకుంటున్నాడు ప్రభాస్. మరి బాహుబలి అంటూ ఒక్క ప్రాజెక్టుతో దేశవ్యాప్తంగా అంత పేరొచ్చింది అని ఏడిచిపోయే వాళ్లు చాలామందే ఉంటారు కానీ.. ఆ సినిమా కోసం నాలుగేళ్ల సమయంతో పాటు.. తన బాడీని ఎన్నో హింసలు పెట్టుకున్న ప్రభాస్ కష్టం వారికి గుర్తు ఉండదు.

అందుకే దర్శకులను ఇప్పుడు ప్రభాస్ ఇబ్బందిపెడుతున్నాడనే టాక్ బాగా ఎక్కువగా వినిపిస్తోంది. నిజానికి అలా ప్రచారం చేస్తున్నారు కొంతమంది. బాహుబలి తర్వాతి సిట్యుయేషన్ ను ప్రభాస్ కూడా ఊహించిఉండడు. అందుకే తన తర్వాతి సినిమా సాహో ను మొదట తెలుగు స్క్రిప్ట్ గానే ప్రిపేర్ చేయించాడు. కానీ బాహుబలి2 తర్వాత తనపై అంచనాలు పెరుగుతాయ్ కాబట్టి.. బిగ్ కాన్వాస్ పై మూవీ చేయాలని.. ఇండియన్ ఆడియన్స్ మొత్తానికి నచ్చేలా స్క్రిప్ట్ ను డెవలప్ చేయించిన మాట నిజమే కావచ్చు.

అలాగే తన దగ్గరకు వస్తున్న దర్శకులను కూడా మల్టీ లాంగ్వేజ్ కి అనువుగా స్టోరీలు ప్రిపేర్ చేయమని కోరుతున్న మాట కూడా వాస్తవమే. అయితే.. ప్రభాస్ చెబుతున్నదాంట్లో తప్పేంటి అన్న పాయింటే అర్ధం కాని విషయం. తనపై అంచనాలు ఉంటాయి కాబట్టి వాటిని అందుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అలాగే అన్ని భాషల్లోనూ సినిమా రిలీజ్ చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి.. అందరినీ మెప్పించేలా మూవీ చేయాలని అనుకుంటున్నాడు.. అంతే కదా. ఈ మాత్రానికే ప్రభాస్ అందరినీ హింసించేస్తున్నాడనే ప్రచారం ఏ మాత్రం సరికాదు.