Begin typing your search above and press return to search.

బాలీవుడ్ ఎంట్రీకి ప్రభాస్ రెడీ

By:  Tupaki Desk   |   24 April 2017 4:55 AM GMT
బాలీవుడ్ ఎంట్రీకి ప్రభాస్ రెడీ
X
బాహుబలి మూవీతో ప్రభాస్ నేషనల్ వైడ్ గా గుర్తింపు సంపాదించేసుకున్నాడు. దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదిచేసుకున్నాడు. బాహుబలి క్రేజ్ తో యంగ్ రెబల్ స్టార్ కు అనేక బాలీవుడ్ మూవీ ఆఫర్స్ కూడా వస్తున్నాయనే వార్తలు చాలానే వినిపించాయి. అయితే.. ఇప్పటివరకూ వీటిపై ఓపెన్ గా ఎప్పుడూ చెప్పని ప్రభాస్.. తొలిసారిగా బాలీవుడ్ పై రియాక్ట్ అయ్యాడు.

బాహుబలి ది కంక్లూజన్ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న ప్రభాస్.. ఓ ఇంటర్వ్యూలో భాగంగా.. తనకు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు ఎలాంటి అభ్యతరం లేదని అన్నాడు. 'నేను బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగానే ఉన్నా. ఇప్పటికే నాకు ఓ ప్రాజెక్ట్ ఆఫర్ కూడా వచ్చింది. అది నాకు తగ్గట్లుగానే ఉంది కూడా. అయితే.. బాహుబలిలో నేను చేస్తున్న పాత్ర మాత్రం నా ఒరిజినాలిటికీ తగినట్లుగా ఉండదు. ఎందుకంటే.. ఈ పాత్ర చాలానే మర్డర్స్ చేస్తుంది కదా' అని నవ్వేశాడు ప్రభాస్.

తన నెక్ట్స్ మూవీ సాహో చిత్రానికి కూడా ఫస్ట్ లుక్ కూడా ఇచ్చేసిన ప్రభాస్.. ఈ మూవీని కూడా గ్రాండ్ గా రూపొందించడమే కాదు.. గ్రాండ్ రిలీజ్ కూడా ప్లాన్ చేశాడు. అందుకే బాహుబలి2 తో కలిపి.. ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయబోతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/