ఈ లుక్ లో ప్రభాస్ కి సాహో అనాల్సిందే

Mon Jul 17 2017 21:53:35 GMT+0530 (IST)

యంగ్ రెబల్ స్టార్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ప్రభాస్.. ప్రతీ సినిమాతోనే వేరియేషన్ చూపించేందుకు తెగ తాపత్రయపడతాడు. ముఖ్యంగా తన లుక్ విషయంలో ప్రభాస్ తీసుకున్నన్ని జాగ్రత్తలు.. మరే ఇతర స్టార్ తీసుకోడేమో అనిపించినా ఆశ్చర్యం లేదు. బాహుబలిగా కనిపించేందుకు ప్రభాస్ పడ్డ తపన.. పడిన కష్టం.. అనితర సాధ్యం అని చెప్పచ్చు.

బాహుబలిగా దేశవ్యాప్తంగా ఖ్యాతి గడించిన ప్రభాస్.. ఇప్పుడు తన మరుసటి చిత్రం కోసం ప్రభాస్ చాలా సీరియస్ గా ప్రిపేర్ అయిపోతున్నాడు. బాహుబలితో పాటే సాహో టీజర్ ఇచ్చినా.. సినిమా థీమ్ ను చెప్పేందుకు అది కేవలం ఇంట్రో మాత్రమే. 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందే ఈ చిత్రానికి అసలు వ్యవహారం అంతా ముందుంది. ఇప్పుడు సాహో కోసం ప్రభాస్ కొత్త లుక్ ను ఫైనలైజ్ చేసినట్లుగా తెలుస్తోంది. గత మూడు నెలలుగా పలు రకాల స్టైల్స్ ను పరిశీలించి.. చివరకు ఇదుగో ఈ లుక్ కి ఫిక్స్ అయ్యాడట ప్రభాస్. తమ హీరో స్టైలిష్ లుక్ చూసి అభిమానులు ఇప్పటికే తెగ హుషారు చూపిస్తున్నారు.

ఇక సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న సాహో మూవీకి చాలానే ఆకర్షణలు చోటు చేసుకోనున్నాయి. శంకర్-ఎహహ్ సాన్-లాయ్ సంగీతం అందించనుండగా.. పీటర్ హెయిన్స్ యాక్షన్ సీక్వెన్స్ అందించంనున్నాడు. నీల్ నిత్ ముఖేష్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తుండడం విశేషం.