'జాన్' ఇటలీ వెళ్లకుండానే!!

Fri Mar 22 2019 07:24:05 GMT+0530 (IST)

ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న `సాహో` ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మేకింగ్ వీడియోలు షేడ్స్ ఆఫ్ సాహో 1 - 2 అభిమానులు సహా అన్ని వర్గాల్ని మెప్పించాయి. యువి క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని దాదాపు 225 కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోంది. యువదర్శకుడు సుజీత్  వర్కింగ్ స్టైల్ ఏ స్థాయిలో ఉంటుందో ఇటీవలే రిలీజైన `షేడ్స్ ఆఫ్ సాహో మేకింగ్ వీడియో 2` ఆవిష్కరించింది. మేకింగ్ విజువల్స్ చూశాక బిజినెస్ స్థాయి పెరిగింది. ఈ సినిమాతో పాటుగా ప్రభాస్ ప్రస్తుతం తన కెరీర్ 20వ సినిమాలోనూ నటిస్తున్నాడు. జిల్ ఫేం రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.యూరఫ్ నేపథ్యంలో ఒక అందమైన ప్రేమకథా చిత్రమిది. ఈ చిత్రంలో ప్రభాస్ వింటేజ్ కార్ల వ్యాపారిగా కనిపించనున్నాడు. ప్రభాస్ గెటప్ పూర్తి డిఫరెంట్ గా ఉంటుందని ఇప్పటికే అందిన లీకులు చెబుతున్నాయి . ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇటలీలో ఇదివరకూ ఓ భారీ షెడ్యూల్ చిత్రీకరించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ సాగుతోంది. ఇటలీని ప్రతిబింబించే సెట్స్ వేసి కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారని సమాచారం. ఇందుకోసం కళాదర్శకుడు రవీందర్ సెట్స్ ని డిజైన్ చేశారు. సెట్స్ రెడీ .. తదుపరి చిత్రీకరణకు టీమ్ రెడీ అవుతోంది.

సాహో ఆగస్టులో రిలీజవుతుండగా వచ్చే ఏడాది సంక్రాంతికి జాన్ చిత్రాన్ని రిలీజ్ చేయాలన్నది ప్లాన్. ఇవి రెండూ వేటికవే ప్రత్యేకం. ప్రభాస్ కెరీర్ ని మరో స్థాయికి తీసుకెళ్లే చిత్రాలుగా చెబుతున్నారు. ముఖ్యంగా ప్రభాస్ లోని లవర్ బోయ్ ని చూపిస్తున్న జాన్ ఎంతో ప్రత్యేకంగా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాల రిలీజ్ తర్వాత ప్రభాస్ పెళ్లిపైనా ఓ క్లారిటీనిస్తామని ఇదివరకూ ప్రభాస్ పెద్దమ్మ గారైన శ్యామలాదేవి మీడియా ముఖంగా తెలిపిన సంగతి తెలిసిందే.