ఆ ఫిజిక్ కోసం నాలుగేళ్ల పాటు కష్టాలు

Mon Mar 20 2017 21:38:38 GMT+0530 (IST)

బాహుబలి మూవీ షూటింగ్ ఎట్టకేలకు పూర్తయిపోయింది.. రీసెంట్ గా ట్రైలర్ వచ్చేసింది.. వచ్చేనెలలో మూవీ కూడా రిలీజ్ అయిపోతోంది. అయితే.. ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటివరకూ ఈ చిత్రానికి నాలుగేళ్ల సమయం పట్టింది. ఇంతకాలం పాటు వేరే సినిమా చేయకుండా కేవలం బాహుబలికే అంకితం అయిపోయాడు ప్రభాస్.

ఇంత కాలం పాటు బాహుబలి ఫిజిక్ ని మెయింటెయిన్ చేయడం అంటే చిన్న విషయం కాదు. పైగా అమరేంద్ర బాహుబలి కేరక్టర్ కోసం భారీగా కనిపించాల్సి ఉంటుంది. శివుడు కం మహేంద్ర బాహుబలి రోల్ కోసం.. సన్నగా ఉండాలి. ఇక్కడే రెండు పాత్రల మధ్య వేరియేషన్ చూపించేందుకు.. కొన్ని సార్లు బరువు పెరగడం.. మళ్లీ తగ్గడం లాంటివి చేశాడు ప్రభాస్. ఆ పాత్రకు తగినట్లుగా తనను తాను సన్నద్ధం చేసుకోవడానికే నెలల సమయం పట్టేదట. అయినా.. సరే ప్రభాస్ చూపించిన కమిట్మెంట్ మాత్రం సూపర్ అంటున్నాడు ప్రభాస్ కి ఫిట్నెస్ ట్రైనింగ్ ఇచ్చిన మిస్టర్ వరల్డ్ టైటిల్ విన్నర్ లక్షణ్ రెడ్డి.

ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నామని.. రెండు రోల్స్ కి రెండు రకాలుగా కనిపించడంతో పాటు.. ఆసమయంలో ఆహారం తీసుకునే విధానం కూడా వేరుగా ఉండేదట. అయితే.. బిర్యానీ అంటే ప్రభాస్ కి ఇష్టం కావడంతో అదొక్కటి మాత్రం తినేవాడట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/