హిందీ నేర్చుకుంటూ.. ప్రభాస్ తెలుగు క్లాసులు

Mon May 21 2018 16:55:43 GMT+0530 (IST)

భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సాహో సినిమాపై రోజు రోజుకి అంచనాలు చాలా పెరిగిపోతున్నాయి. ప్రభాస్ సినిమాకు సంబందించిన ఎలాంటి విషయం బయటకు వచ్చినా వైరల్ అవ్వడం కామన్ అయిపొయింది. ఇక సినిమాలో భారీ తారాగణాన్ని చూస్తుంటే సినిమా హాలీవుడ్ రెంజ్ లో ట్రెండ్ సెట్ చేయడం పక్కా అని టాక్ వస్తోంది. ఇకపోతే సాహో సినిమా రెండు విభిన్న భాషలో తెరకెక్కుతోన్న సంగతి  తెలిసిందే.హిందీ - తెలుగు భాషలకు సంబందించిన సన్నివేశాలను చిత్ర యూనిట్ ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా చిత్రీకరిస్తోంది. దర్శకుడు సుజీత్ బాలీవుడ్ టేస్ట్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా సినిమా చేస్తున్నాడు. అయితే ప్రభాస్ కి సరిగ్గా హిందీ రాదు. అలాగే నటీనటులకు చాలా వరకు తెలుగు రాదు. ఇప్పటికే హీరోయిన్ శ్రద్దా అలవాటు పడినా మరో నటి ఎవిలిన్ శర్మా ఇంకా నేర్చుకోలేదు. ఆమె రీసెంట్ గా అబుదాబి లో స్టార్ట్ అయినా యాక్షన్ షెడ్యూల్ లో జాయిన్ అయ్యింది.

అయితే ఈ షెడ్యూల్ లోనే ఎవిలిన్ వీలైనంత వరకు తెలుగు నేర్చుకోవాలని అనుకుంటోంది. దీంతో ప్రభాస్ నుంచి కొంత బాషపై పట్టు సాదించాలను చూస్తోంది. ప్రభాస్ కూడా ప్రస్తుతం హిందీ నేర్చుకునే పనిలో ఉన్నాడు. షూటింగ్ అయిపోయే లోపు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలని చూస్తున్నాడు. అందుకే ఆమెకు ప్రభాస్ తెలుగు నేర్పుతుంటే.. ఆమె కూడా ప్రభాస్ కు హిందీ నేర్పుతోందట. విషయం ఏంటంటే.. ఎవిలిన్ కు కూడా అంత రేంజులో హిందీ కూడా రాదు. ఆమె జర్మనీలో పుట్టి పెరిగిన భారత సంతతి చెందిన అమ్మాయిలే.