Begin typing your search above and press return to search.

సాహోలో ప్రభాస్ దొంగా పోలీసా?

By:  Tupaki Desk   |   18 Jun 2019 7:16 AM GMT
సాహోలో ప్రభాస్ దొంగా పోలీసా?
X
కొద్దిరోజుల క్రితం విడుదలైన సాహో టీజర్ పాతిక మిలియన్ల వ్యూస్ దాటేసి ఇంకా దూసుకుపోతూనే ఉంది. అన్ని కీలకమైన భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేయడంతో నెంబర్ భారీగా వస్తోంది. టీజర్ బ్రహ్మాండంగా ఉందనే టాక్ తెచ్చుకుంది కానీ కథకు సంబంధించి హీరో హీరోయిన్ల పాత్రకు సంబంధించి అందులో ఎలాంటి క్లూ ఇవ్వకపోవడం అభిమానులను సస్పెన్స్ లో పెట్టేసింది. కానీ ఓ ఇంటర్వ్యూలో శ్రద్ధా కపూర్ సాహోలో చేస్తున్న రోల్ గురించి చెప్పేసింది.

ఇందులో తాను పోలీస్ ఆఫీసరట. సినిమా మొత్తం పాటలు మినహాయించి చేతిలో గన్నుతోనే ఉంటుందట. అది ఎంతగా ప్రభావితం చూపించిందంటే చేయి లాగే తుపాకీ కూడా తన శరీరంలో భాగం అనేంతగా. ఎప్పటినుంచో ఫుల్ లెన్త్ పోలీస్ గా కనిపించాలన్న కోరిక సాహోతో తీరిపోయిందని క్లారిటీ ఇచ్చేసింది. సరే తనవరకు బాగానే ఉంది కానీ మరి ప్రభాస్ జాబ్ ఏంటి అని అనుమానం వస్తోంది కదూ. అది ట్రైలర్ వచ్చాక కొంత క్లారిటీ రావొచ్చు.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం ప్రభాస్ దొంగ తరహాలో చాలా డిఫరెంట్ గా ఉంటుందట. ఒకవేళ అదే నిజమైతే పోలీసైన శ్రద్ధ ప్రభాస్ తో ఎందుకు లవ్ లో పడింది అతనితోనే ఎందుకు ఫైట్లు గట్రా చేసింది లాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే. కనివిని ఎరుగని యాక్షన్ మసాలాను తెరపై ఆవిష్కరించబోతున్న సాహో బిజినెస్ ఇప్పటికే ఊపందుకుంది. బాహుబలి రేంజ్ లో బిజినెస్ డీల్స్ వస్తున్నాయని టాక్ ఉంది. ఇంకా ఆగస్ట్ 15కి రెండు నెలలు ఉన్న నేపథ్యంలో రోజుకో గండంలా ఫీలవుతున్నారు డార్లింగ్ ఫాన్స్.