Begin typing your search above and press return to search.

సాహో కోసం వారు చెయ్యేస్తున్నారు

By:  Tupaki Desk   |   12 March 2018 5:08 AM GMT
సాహో కోసం వారు చెయ్యేస్తున్నారు
X

బాహుబలి గ్రాండ్ సక్సెస్ ప్రభాస్ కు బ్రహ్మాండమైన ఇమేజ్ తెచ్చిపెట్టింది. అంతకుముందు కేవలం టాలీవుడ్ లోనే వినిపించే ప్రభాస్ పేరు బాహుబలితో దేశం మొత్తం వినిపించింది. బాహుబలి తరవాత యంగ్ రెబల్ స్టార్ చేస్తున్న సాహో సినిమాపై విపరీతంగా అంచనాలు పెరిగిపోయాయి. దానికి తగ్గట్టు యువీ క్రియేషన్స్ ఈ మూవీని రూ. 150 కోట్ల భారీ బడ్జెట్ ఖర్చు చేస్తోంది.

ఇప్పుడు ఈ సినిమాపై పెరిగిన అంచనాలు డైరెక్టర్ సుజిత్ పై విపరీతమైన ఒత్తిడి పెంచుతున్నాయి. ఇంతవరకు సుజిత్ డైరెక్ట్ చేసింది కేవలం రన్ రాజా రన్ చిత్రం ఒక్కటే. ఫన్ మిక్స్ డ్ థ్రిల్లర్ గా వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్టయింది. కేవలం ఒక్క సినిమా అనుభవంతో హై ఎండ్ యాక్షన్ ఎంటర్ టెయినర్ గా సాహోను ఎంతవరకు తీర్చిదిద్దగలడన్న డౌట్లు టాలీవుడ్ నుంచే కాదు.. బాలీవుడ్ నుంచి కూడా వినిపిస్తున్నాయి. దానికితోడు సాహోను తెలుగుతోపాటు తమిళం.. మళయాళం.. హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. డైరెక్టర్ సుజిత్ కు మల్టీ లాంగ్వేజ్ సినిమా తీసిన అనుభవమే లేదు.

ఈ సినిమా షూటింగుకు సంబంధించి మొత్తం భారమంతా సుజిత్ పైనే మోపితే అనుకున్న రిజల్ట్ రావడం కష్టమవుతుందనే టాక్ రావడంతో ఫిలిం మేకర్స్ జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టారట. వాళ్ల సూచన మేరకు హీరో ప్రభాస్... సినిమాటోగ్రాఫర్ మది షూటింగ్ స్పాట్ లో మరింత ఇన్వాల్వ్ అవుతున్నారట. అనుకున్న క్వాలిటీతో అవుట్ పుట్ వస్తోంది లేనిదీ తరచుగా చెక్ చేసుకుంటూ ముందుకెళుతున్నారని తెలుస్తోంది. ప్రభాస్ ఇమేజ్.. భారీ మొత్తం పెట్టుబడి కాపాడుకోవాలంటే ఆ మాత్రం జాగ్రత్త మంచిదే. కానీ అలాగని సుజిత్ పై మరీ ఒత్తిడి పెంచితే మొదటికే మోసం వచ్చేయగలదు.