Begin typing your search above and press return to search.

టుస్సాడ్స్ లో ప్రభాస్.. వాటే హానర్!!

By:  Tupaki Desk   |   1 Oct 2016 11:18 AM GMT
టుస్సాడ్స్ లో ప్రభాస్.. వాటే హానర్!!
X
బాహుబలి మూవీతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ పెరిగిపోతోంది. సినిమా సృష్టించిన సంచలనాల సంగతేమో కానీ.. పర్సనల్ గా మాత్రం ఈ బాహుబలి చాలా మెట్లు ఎక్కేస్తున్నాడు. ఇప్పుడు దక్షిణాదిలో ఏ సినీ దిగ్గజం అందుకోలేకపోయిన ఓ ఘనతను ప్రభాస్ దక్కించుకుంటున్నాడు.

సృష్టికి ప్రతిసృష్టి చేసినట్లుగా.. సెలబ్రిటీలకు నకలుగా మైనపు బొమ్మలను తయారు చేయడంలో టుస్సాడ్స్ ఘనత చాలానే ఉంది. తొలిసారిగా ఓ దక్షిణాది సెలబ్రిటీగా టుస్సాడ్స్ లో ప్రభాస్ మైనపు బొమ్మ ఏర్పాటవుతోంది. బ్యాంకాక్ టుస్సాడ్స్ లో ప్రభాస్ మైనపు విగ్రహం ఏర్పాటు కానుండగా.. ఈ విషయాన్ని టుస్సాడ్స్ మ్యూజియం హెడ్ నొప్పడాన్ ప్రపీమ్ పంట్ చెప్పాడు. ఇప్పటికే హైద్రాబాద్ వచ్చి.. ఈ విషయాన్ని ప్రభాస్ కి చెప్పి.. ఆయన ఫోటోగ్రాఫ్ లను తీసుకున్నట్లు కూడా చెప్పారాయన. ఈ విగ్రహం రూపొందించడానికి కనీసం 350 ఫోటోలను తీసుకుంటాయి టుస్సాడ్స్ వర్గాలు.

టుస్సాడ్స్ మ్యూజియంలో రీసెంట్ గా ప్రధాని నరేంద్ర మోడీ మైనపు బొమ్మ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రభాస్ మాత్రమే ఈ ఘనత దక్కించుకుంటున్నాడు. బ్యాంకాక్ లో ఏర్పాటైన టుస్సాడ్స్ మ్యూజియంలో మరే సెలబ్రిటీకి ఇప్పటివరకూ స్థానం లేకపోవడం విశేషం. ప్రభాస్.. వాటే హానర్ గురూ!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/