Begin typing your search above and press return to search.

పద్మావత్ కోసం ప్రభాస్ పడిగాపులు

By:  Tupaki Desk   |   16 Jan 2018 4:02 AM GMT
పద్మావత్ కోసం ప్రభాస్ పడిగాపులు
X
బాహుబలి మూవీ తర్వాత ప్రభాస్ చేస్తున్న మూవీ సాహో. బాహుబలి2 రిలీజ్ సమయానికే సాహో టీజర్ కూడా ఇచ్చేసిన సంగతి అభిమానులకు గుర్తుండే ఉంటుంది. అయితే.. సాహో విషయంలో అత్యధికంగా జనాలను వెయిట్ చేయించిన పాయింట్.. హీరోయిన్ ఎవరనే సంగతే.

ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ తన నెక్ట్స్ మూవీ విషయంలో కూడా ఓ క్లారిటీకి వచ్చేశాడు. ఇప్పటికే దర్శకుడు.. స్టోరీ కూడా ఫైనల్ అయిపోయాయట. కాకపోతే.. ఈ సినిమాకు కూడా బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోవాలనే చూస్తున్నారట. సాహో చిత్రానికి శ్రద్ధా కపూర్ ను తీసుకొస్తున్న ప్రభాస్.. మరుసటి చిత్రానికి మాత్రం బాలీవుడ్ టాప్ బ్యూటీ దీపికా పదుకొనేతో నటింపచేయాలని ఫిక్స్ అయ్యాడట. ఇప్పటికే పలుమార్లు మేకర్స్ ఆమెను అప్రోచ్ అయ్యారట కూడా. అయితే.. ఆమె నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది. ముఖ్యంగా పద్మావతి అలియాస్ పద్మావత్ చిత్రం పైనే దృష్టి కేంద్రీకరించింది దీపికా పదుకొనే.

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన పద్మావత్ ను.. ఈ నెల 25న విడుదల చేసేందుకు ట్రై చేస్తున్నారు. ఆ మూవీ రిలీజ్ తర్వాతే తాను ఏ నిర్ణయమైనా చెప్పగలనని తేల్చేసిందట దీపికా పదుకొనే. అలా అప్పటివరకూ ప్రభాస్ సినిమాపై డెసిషన్ ను పెండింగ్ లో పెట్టేసింది. దీపికా వెయిటింగ్ మోడ్ లో పెట్టేయడంతో.. ప్రభాస్ కూడా పద్మావత్ రిలీజ్ కోసం ఎదురుచూడకతప్పడం లేదని తెలుస్తోంది.